బన్నీ, సుక్కు కాంబినేషన్‌కు టైటిల్ సెంటిమెంట్

by Shyam |

<p>దిశ, వెబ్‌డెస్క్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ .. &#8216;అల వైకుంఠపురంలో&#8217; సినిమాతో అదిరిపోయే హిట్ అందుకున్నారు. దీంతో ఫుల్ స్వింగ్‌లో ఉన్న బన్నీ&#8230; తర్వాత సినిమాను అంతే వేగంగా పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. సుకుమార్ డైరెక్షన్‌లో సినిమా చేస్తుండగా&#8230; ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో స్టోరీ ఉంటుందని టాక్. ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్‌గా కనిపిస్తాడని తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు &#8216;శేషాచలం&#8217; అనే టైటిల్ అయితే బాగుంటుందని అనుకున్నారట. కానీ &#8216;ఆర్య&#8217;, &#8216;ఆర్య2&#8217; తర్వాత [&hellip;]</p>

బన్నీ, సుక్కు కాంబినేషన్‌కు టైటిల్ సెంటిమెంట్
X

దిశ, వెబ్‌డెస్క్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ .. ‘అల వైకుంఠపురంలో’ సినిమాతో అదిరిపోయే హిట్ అందుకున్నారు. దీంతో ఫుల్ స్వింగ్‌లో ఉన్న బన్నీ… తర్వాత సినిమాను అంతే వేగంగా పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. సుకుమార్ డైరెక్షన్‌లో సినిమా చేస్తుండగా… ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో స్టోరీ ఉంటుందని టాక్. ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్‌గా కనిపిస్తాడని తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు ‘శేషాచలం’ అనే టైటిల్ అయితే బాగుంటుందని అనుకున్నారట. కానీ ‘ఆర్య’, ‘ఆర్య2’ తర్వాత బన్నీ, సుక్కుల హ్యాట్రీక్ కాంబినేషన్ రిపీట్ అవుతుండడంతో… రెండు అక్షరాల సెంటిమెంట్‌ను మూడో సినిమాకు కూడా ఫాలో అవుతున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.

ఈ నెల 8న బన్నీ పుట్టినరోజు ఉండడంతో ఈ సినిమా టైటిల్ పోస్టర్, ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతుందని ఆశిస్తున్నారు ఫ్యాన్స్. ఆ రోజే టైటిల్ రివీల్ అవుతుండగా… రెండు అక్షరాల సెంటిమెంటే ఖచ్చితంగా రిపీట్ కానుందని చెబుతున్నారు. చూడాలి మరి… సినిమా టైటిల్ ఏంటి? బన్నీ లుక్ ఎలా ఉండబోతోంది? అనేది.

tags : Allu Arjun, Sukumar, Title Sentiment, Tollywood

Next Story