ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావ్ థమన్…

by  |
ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావ్ థమన్…
X

దిశ, వెబ్‌డెస్క్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.థమన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. థమన్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడని కొనియాడారు. ‘అల వైకుంఠపురంలో’ సినిమాకు ముందు .. ఆల్బమ్ బిలియన్ వ్యూస్ సాధించాలని థమన్‌ను కోరానని తెలిపాడు. అప్పుడు థమన్ ‘సరే బ్రదర్ అని ప్రామీస్ చేశాడు’ అని చెప్పాడు. ఇచ్చిన మాట ప్రకారం ‘అల వైకుంఠపురంలో’ ఆల్బమ్ 1.13 బిలియన్ వ్యూస్ దాటిందని ట్వీట్ చేశాడు స్టైలిష్ స్టార్. మిమ్మల్ని చూసి గర్వపడుతున్నానని … మీరిచ్చిన ఆల్బమ్‌తో పూర్తిగా సంతృప్తి చెందానని ధన్యవాదాలు తెలిపాడు.

దీనికి రిప్లై ఇచ్చిన థమన్ … బన్నీ మీ నుంచి చాలా పెద్ద మాటలు ఇవి. నిజానికి ఆల్బమ్ ఇంత గొప్పగా వచ్చిందంటే ఆ క్రెడిట్ మీకు, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌కే దక్కుతుందన్నారు. ‘అల వైకుంఠపురంలో’ సినిమా కోసం మీతో చేసిన ప్రయాణం నా హృదయానికి చాలా దగ్గరైందన్నారు. మీరిద్దరు నా పట్ల చూపించిన ప్రేమ, నమ్మకం వల్లే … నేను 100 శాతం ఎఫర్ట్స్‌తో ఇంత గొప్ప ఆల్బమ్ ఇవ్వగలిగానని తెలిపారు. మీరు నన్ను అభినందిస్తూ పెట్టిన ట్వీట్‌ను జీవితాంతం దాచుకుంటానని చెప్పారు. మీ పట్ల ప్రేమ, గౌరవం లైఫ్ లాంగ్ ఉంటుందన్నారు థమన్.

Tags: Allu Arjun, Trivikram Srinivas, SS Thaman, Ala Vaikuntapuramlo

Next Story

Most Viewed