- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు షాక్.. ఆగిపోయిన ‘పుష్ప’ సినిమా ప్రదర్శన?
<p>దిశ, జగిత్యాల : జగిత్యాల పట్టణంలోని శ్రీనివాస థియేటర్‌లో అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప’ సినిమా ప్రదర్శిస్తుండగా ఒక్క సారిగా ఆగిపోయింది. శుక్రవారం సాయంకాలం సాంకేతిక కారణాలతో పుష్ప సినిమా నిలిచిపోవడంతో స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. టాకీస్ వద్ద అల్లుఅర్జున్ అభిమానులు ఆందోళన చేయడంతో పాటు థియేటర్ పై దాడికి దిగారు. సినిమా వీక్షించేందుకు చెల్లించిన వారంతా టికెట్ డబ్బులు వాపస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. టాకీస్ నిర్వాహకులు ఎంత చెప్పిన […]</p>

X
దిశ, జగిత్యాల : జగిత్యాల పట్టణంలోని శ్రీనివాస థియేటర్‌లో అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప’ సినిమా ప్రదర్శిస్తుండగా ఒక్క సారిగా ఆగిపోయింది. శుక్రవారం సాయంకాలం సాంకేతిక కారణాలతో పుష్ప సినిమా నిలిచిపోవడంతో స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. టాకీస్ వద్ద అల్లుఅర్జున్ అభిమానులు ఆందోళన చేయడంతో పాటు థియేటర్ పై దాడికి దిగారు. సినిమా వీక్షించేందుకు చెల్లించిన వారంతా టికెట్ డబ్బులు వాపస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. టాకీస్ నిర్వాహకులు ఎంత చెప్పిన వినకపోవడంతో టాకీస్ వద్ద గందరగోళ పరిస్థితి నెలకొంది. అయితే శాటిలైట్ సిస్టం వల్ల ఏర్పడిన సాంకేతిక కారణంగా సినిమా ప్రదర్శన నిలిచిపోయిందని తెలుస్తోంది.
Next Story






