‘పుష్ప’ రిలీజ్.. భారత్ బంద్‌కు డిమాండ్..

by  |
pushpa
X

దిశ, సినిమా : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమా రేపే రిలీజ్ కానుండగా.. అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. ఈ ఫెస్టివ్ వైబ్స్ కొనసాగించేందుకు.. చెన్నైకి చెందిన భారత్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఏకంగా హాలిడే డిమాండ్ చేశారు. మేము ఎలాగూ కాలేజీకి రావాలని అనుకోవడం లేదు కాబట్టి అఫిషియల్‌గా హాలీడే ప్రకటిస్తే బాగుంటుందని HODకి లెటర్ రాశారు.

సినిమా చూస్తుంటాం కాబట్టి… కాలేజీ నుంచి ఎలాంటి కాల్స్, మెసేజెస్‌ చేసి, అనవసరంగా డిస్టర్స్ చేయకూడదని కోరారు బన్నీ ఫ్యాన్స్. ఇక తమ దగ్గర ఎక్స్‌ట్రా టికెట్ ఉంది కాబట్టి సినిమా చూడాలనుకుంటే తమతో రావొచ్చని HODకి బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారు. ఇక ఈ లెటర్‌పై రకరకాల మీమ్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. ‘భారత్ బంద్ చేయిస్తే బాగుండు కదా’ లాంటి ఫన్నీ మీమ్స్ ట్రెండ్ అయ్యాయి.


Next Story

Most Viewed