నా ప్రేమ నువ్వే అయాన్.. హ్యాపీ బర్త్ డే : బన్నీ

by  |
నా ప్రేమ నువ్వే అయాన్.. హ్యాపీ బర్త్ డే : బన్నీ
X

దిశ, వెబ్‌డెస్క్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన పిల్లలు అయాన్, అర్హాలను ఎంత ప్రేమగా చూసుకుంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయాన్, అర్హాల ప్రెజెన్స్‌ను చాలా బాగా ఎంజాయ్ చేసే బన్నీ.. వారితో టైం స్పెండ్ చేయడాన్ని చాలా ఇష్టపడతాడు. వాళ్ల అల్లరిని తండ్రిగా ఆస్వాదిస్తూనే.. సోషల్ మీడియాలో అభిమానులతోనూ షేర్ చేసుకుంటాడు. అయితో శుక్రవారం అయాన్ ఆరో పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా భావోద్వేగానికి లోనైన బన్నీ.. ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.

”నేను ఎప్పుడూ ఆలోచిస్తుంటాను అసలు ప్రేమంటే ఏంటని?. గతంలో చాలా సార్లు అనుకున్నాను ఇదేనేమో ప్రేమంటే అని.. కానీ ఖచ్చితంగా ఇదేనని మాత్రం నమ్మలేకపోయా. నువ్వు నా జీవితంలోకి వచ్చాక ఇప్పుడు అర్ధమైంది అసలు ప్రేమంటే ఏమిటనేది. ఐ లవ్ యూ అయాన్.. హ్యాపీ బర్త్ డే మై బేబి అంటూ విష్ చేశాడు.” దీంతో సోషల్ మీడియాలో జూనియర్ స్టైలిష్ స్టార్ అయాన్‌కు జన్మదిన శుభాకాంక్షలు అంటూ విష్ చేస్తున్నారు బన్నీ ఫ్యాన్స్.


Tags: Allu Arjun, Allu Ayaan, Birthday


Next Story