అల్లు అర్జున్ కార‌వాన్‌కు ప్రమాదం

by  |
అల్లు అర్జున్ కార‌వాన్‌కు ప్రమాదం
X

దిశ, వెబ్‌డెస్క్: హీరో అల్లు అర్జున్ కార‌వాన్‌కు ప్రమాదం జరిగింది. శనివారం ‘పుష్ప’ సినిమా షూటింగ్‌లో పాల్గొని వస్తుండగా ఖమ్మం సమీపంలో ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ప్రమాద సమయంలో వాహనంలో హీరో అల్లు అర్జున్ లేడని చిత్ర యూనిట్ తెలిపింది. ఐదారుగురు మేకప్‌ టీమ్ మాత్రమే ఉన్నారని, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని సినిమా యూనిట్ వెల్లడించింది. కార‌వాన్‌కు సడన్ బ్రేక్ వేయడంతో వెనక ఉన్న మరో వాహనం ఢీకొట్టినట్లు తెలుస్తోంది.

A
A

అయితే… పుష్ప షూటింగ్‌ను మొదలు పెట్టినప్పటి నుంచి టీమ్‌కు అంతగా కలిసి రావడం లేదని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆ సినిమాకు పనిచేస్తున్న సినీ ఫోటో గ్రాఫర్ జి.శ్రీనివాస్‌ గుండెపోటుతో ఇటీవల చనిపోయారు. అంతకు ముందు కరోనా కారణంగా పుష్ప సినిమా షూటింగ్ వాయిదా పడి.. అనంతరం పరిశ్రమలో అన్ని సినిమాలు షూటింగ్స్ ప్రారంభమైనప్పటికీ… కొన్ని అనివార్య కారణాలతో ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించలేదు. నెలన్నర క్రితమే సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేసినప్పటికీ.. సినీ ఫోటో గ్రాఫర్ చనిపోవడం, ఇప్పుడు అల్లు అర్జున్ కార‌వాన్‌కు ప్రమాదం జరగడంతో సినిమా యూనిట్ టెన్షన్‌ పడుతోంది.

పుష్ప సినిమాకు సుకుమార్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తోన్న విషయం తెలిసిందే. గతంలో సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో ఆర్య సినిమా వచ్చి సంచలన విజయం సాధించగా.. రెండో సినిమాగా ఆర్య 2 వచ్చింది. ఇప్పుడు సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో హ్యాట్రిక్ మూవీగా ‘పుష్ప’ చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్.



Next Story

Most Viewed