'శాకుంతలం'లో అల్లువారి అల్లరి యువరాణి..

by  |
allu arha news
X

దిశ, వెబ్‌డెస్క్: అల్లువారి కుటుంబంలో అల్లు అర్హ అల్లరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ గారాల పట్టీగా.. అల్లు వారి రాజ్యానికి యువరాణిలా అర్హ.. చిన్నతనం నుంచే ఎంతోమంది అభిమానులను పోగేసుకుంది. ఇక ఆమె తల్లి స్నేహ, అర్హ ఫోటోలను, ముఖ్యంగా అర్హ తన ముద్దు ముద్ద మాటలతో అల్లరి చేష్టలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇక తాజాగా అల్లు వారి నాలుగవ తరం కూడా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ‘శాకుంతలం’ చిత్రంలో అల్లు అర్హ .. చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం కానుంది.

శకుంతల – దుష్యంతుడి ప్రేమ కథ ఆధారంగా గుణ శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ అందమైన ప్రేమ కావ్యంలో అక్కినేని సమంత శాకుంతల గా కనిపిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ ప్రారంభించిన ఈ చిత్రంలో ప్రిన్స్ భారత పాత్రలో అల్లు అర్హ కనిపించనునట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. గుణశేఖర్ వంటి స్టార్ డైరెక్టర్ చేతుల మీదుగా అర్హ తెరంగ్రేటం చేయడం చర్చనీయాంశంగా మారింది. మరి ఈ అద్భుతమైన ప్రేమ కావ్యంలో యువరాణి అర్హ ఎంతటి అల్లరిని చేయనుందో చూడాలి.

Next Story

Most Viewed