- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లాసెట్ ఫస్ట్ ఫేస్ సీట్ల కేటాయింపు
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో: ఎల్ఎల్ బీ, ఎల్ఎల్ఎం ప్రవేశాలకు గాను ఫస్ట్ ఫేస్ సీట్ల కేటాయింపు పూర్తయిందని ఉన్నత విద్యామండలి శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. లాసెట్ 2021లో భాగంగా కన్వనీనర్ కోటాలో 5339 మందికి సీట్ అలాట్మెంట్ జరిగినట్లు లాసెట్ కన్వీనర్ రమేశ్‌బాబు పేర్కొన్నారు. కాగా 966 సీట్లు మిగిలిపోయినట్లు తెలిపారు. మొత్తం 11180 మంది వెబ్ఆప్షన్లు ఇచ్చుకున్నారని, అందులో మూడేళ్ల ఎల్ఎల్ బీ కోర్సులో 3375 మందికి, ఐదేళ్ల ఎల్ఎల్ బీ కోర్సులో 1312 […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: ఎల్ఎల్ బీ, ఎల్ఎల్ఎం ప్రవేశాలకు గాను ఫస్ట్ ఫేస్ సీట్ల కేటాయింపు పూర్తయిందని ఉన్నత విద్యామండలి శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. లాసెట్ 2021లో భాగంగా కన్వనీనర్ కోటాలో 5339 మందికి సీట్ అలాట్మెంట్ జరిగినట్లు లాసెట్ కన్వీనర్ రమేశ్‌బాబు పేర్కొన్నారు. కాగా 966 సీట్లు మిగిలిపోయినట్లు తెలిపారు. మొత్తం 11180 మంది వెబ్ఆప్షన్లు ఇచ్చుకున్నారని, అందులో మూడేళ్ల ఎల్ఎల్ బీ కోర్సులో 3375 మందికి, ఐదేళ్ల ఎల్ఎల్ బీ కోర్సులో 1312 మందికి, ఎల్ఎల్ఎం లో 652 మందికి సీట్ల కేటాయింపు జరిగినట్లు పేర్కొన్నారు. ఈ విద్యార్థులు ఈనెల 18 నుంచి 23 మధ్య కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని తెలిపారు. ఈ నెల 27వ తేదీ నుంచి వీరికి తరగతులు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు.
Next Story






