- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మైనర్ బాలికపై అత్యాచారయత్నం చేసినట్లు ఆరోపణ
<p>దిశ, పాలేరు: అభం, శుభం తెలియని ఆరేళ్ళ మైనర్ బాలికపై 10వ తరగతి బాలుడు అత్యాచారం యత్నం చేసినట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్న ఘటన పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండలంలోని ఓ ప్రాథమిక పాఠశాలలో సోమవారం చోటుచేసుకుంది. సాయంత్రం 3.30 గంటలకు విరామ సమయంలో పాఠశాలకు వచ్చిన బాలుడు ఆ పాపను పాఠశాల బాత్రూమ్ వైపు తీసుకెళ్లి వికృత చేష్టలు చేయబోయాడు. పాఠశాలలో జరిగిన పరిస్థితిని పాప తన తల్లికి చెప్పే సమయంలో ఆ బాలుడు కూడా వచ్చి […]</p>

X
దిశ, పాలేరు: అభం, శుభం తెలియని ఆరేళ్ళ మైనర్ బాలికపై 10వ తరగతి బాలుడు అత్యాచారం యత్నం చేసినట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్న ఘటన పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండలంలోని ఓ ప్రాథమిక పాఠశాలలో సోమవారం చోటుచేసుకుంది. సాయంత్రం 3.30 గంటలకు విరామ సమయంలో పాఠశాలకు వచ్చిన బాలుడు ఆ పాపను పాఠశాల బాత్రూమ్ వైపు తీసుకెళ్లి వికృత చేష్టలు చేయబోయాడు. పాఠశాలలో జరిగిన పరిస్థితిని పాప తన తల్లికి చెప్పే సమయంలో ఆ బాలుడు కూడా వచ్చి తప్పయిందని, తనను క్షమించాలని వేడుకున్నట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న పాప తండ్రి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు పాపను లేడీ కానిస్టేబుల్ సమక్షంలో ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ప్రాథమిక సమాచారం మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






