సీఎం దృష్టిలో పడేందుకు టీఆర్ఎస్ నేతల నానా పాట్లు…

125

దిశ, బంజారాహిల్స్: రేపు మాదాపూర్ హైటెక్స్ లో టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ జరగనుండడంతో సీఎం కేసీఆర్ దృష్టిలో పడాలని నానా పాట్లు పడుతున్నారు. ఆయన దృష్టిలో పడాలని భారీ స్థాయిలో కటౌట్లు ఏర్పాటు ముఖ్యమంత్రి మనసు గెలిచి మంచి మార్కులు కొట్టేయాలని భావిస్తున్నారు. రేపు జరగబోయే ప్లీనరీకి ప్రగతి భవన్ నుండి పంజాగుట్ట ప్లై ఓవర్ నుండి బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్ మీదుగా హైటెక్స్ మీదుగా ప్లీనరీకి చేరుకోనున్నారు. దీంతో పంజాగుట్ట నుండు సభా స్థలి వరకు రోడ్లన్నీ గులాబీ మయంగా మారాయి. సీఎం తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రూట్ లొనే వెళ్లనుండదంతో అందరి దృష్టిలో పడాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, గ్రేటర్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, స్థానిక వెంకటేశ్వర కాలనీ డివిజన్ కార్పొరేటర్ మన్నె కవితా రెడ్డి సీఎం ను పొగుడుతూ, టీఆర్ఎస్ నాయకులకు స్వాగతం తెలియజేస్తూ,భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు.

పంజాగుట్ట , నాగార్జున సర్కిల్, టీవి 9 చౌరస్తా ,కేబీఆర్ పార్కు చౌరస్తా,జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్,పెద్దమ్మ గుడి,నీరుస్ చౌరస్తా , మాదాపూర్ వరకు రోడ్లన్నీ గులాబీ మయంగా మార్చేశారు. లక్షలు ఖర్చు పెట్టి మరి ఈ స్థాయిలో కటౌట్లు ఏర్పాటు చేసిన నేతలు సీఎం మనసును ఎవరు గెలుచుకుంటారో అంటూ టీఆర్ఎస్ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..