ఇది న్యాయ స్థానాలను బలహీన పరిచే చర్య….

145

దిశ, వెబ్ డెస్క్:
న్యాయమూర్తులపై ఆరోపణలు చేస్తూ సీఎం జగన్ లేఖ రాయడం, అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడాన్ని అఖిల భారత న్యాయమూర్తుల సంఘం ఖండించింది. ఏపీ సీఎం చేసిన ప్రయత్నం న్యాయ స్థానాలను కించపరిచేదిగా ఉందన్నారు. ఈ చర్య న్యాయ స్థానాలను బలహీన పరిచే ప్రయత్నంగా వారు అభివర్ణిస్తూ తీర్మానం చేశారు.

కాగా ఏపీలో న్యాయవ్యవస్థ పనితీరుపై భారత ప్రధాన న్యాయమూర్తి అరవింద్ బాబ్డేకు సీఎం జగన్ లేఖ రాశారు. ఏపీ హై కోర్టును సుప్రీం కోర్టు జడ్జి ఎన్వీ రమణ ప్రభావితం చేస్తున్నారని ఆయన లేఖలో పేర్కొన్నారు. పలువురు హైకోర్టు జడ్జిలపై ఆయన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.