- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కబ్జాకు గురవుతున్న ప్రభుత్వ భూములను కాపాడాలి
<p>దిశ, మహబూబ్ నగర్: అన్యాక్రాంతం అవుతున్న ప్రభుత్వ భూములను కాపాడాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కౌన్సిలర్లు ఆందోళన చేపట్టారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లి, అసద్ పూర్ శివారులో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం సురభిరాజా ఆదిత్యా లక్ష్మణరావు, రత్నబాల సర్వే నెంబర్ 11.168లో ప్రభుత్వానికి అప్పజెప్పిన రిజర్వ్ ఫారెస్ట్ భూములకు మళ్ళీ పట్టా ఎలా చేపడతారని ప్రశ్నించారు. ఈ మేరకు అన్యాక్రాంతం అవుతున్న ప్రభుత్వ భూములను కాపాడాలని డిమాండ్ చేస్తూ […]</p>

దిశ, మహబూబ్ నగర్: అన్యాక్రాంతం అవుతున్న ప్రభుత్వ భూములను కాపాడాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కౌన్సిలర్లు ఆందోళన చేపట్టారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లి, అసద్ పూర్ శివారులో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం సురభిరాజా ఆదిత్యా లక్ష్మణరావు, రత్నబాల సర్వే నెంబర్ 11.168లో ప్రభుత్వానికి అప్పజెప్పిన రిజర్వ్ ఫారెస్ట్ భూములకు మళ్ళీ పట్టా ఎలా చేపడతారని ప్రశ్నించారు. ఈ మేరకు అన్యాక్రాంతం అవుతున్న ప్రభుత్వ భూములను కాపాడాలని డిమాండ్ చేస్తూ కొల్లాపూర్ పట్టణంలో బుధవారం ర్యాలీ నిర్వహించారు. మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు వర్గీయులు( ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కౌన్సిలర్లు) అనంతరం కొల్లాపూర్ తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ రహీం మాట్లాడుతూ.. ఫారెస్ట్‌కు ఇచ్చిన భూములను వేరే వ్యక్తులకు అమ్మే ప్రయత్నం చేస్తున్నారని.. వందల ఎకరాల్లో భారీ భూ కుంభకోణానికి కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలని కోరారు.






