జాగృతి బతుకమ్మ పాటకు ఆల్ ఇండియా క్రేజ్.. ఇద్దరు దిగ్గజ దర్శకులు రంగంలోకి

by  |
జాగృతి బతుకమ్మ పాటకు ఆల్ ఇండియా క్రేజ్.. ఇద్దరు దిగ్గజ దర్శకులు రంగంలోకి
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేతృత్వంలోని తెలంగాణ జాగృతి సంస్థ రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున బతుకమ్మ సంబురాలు నిర్వహిస్తోంది. అయితే, జాగృతి తరఫున ప్రతి సంవత్సరం బతుకమ్మ ప్రాముఖ్యత ప్రతిబింబించేలా ఓ పాటను రిలీజ్ చేస్తూ ఉంటారు. ఈ యేడాది కూడా సరికొత్తగా బతుకమ్మ పాటను రూపొందిస్తున్నారు. ఈ పాటకు ఆస్కార్ అవార్డు విజేత, సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తుండగా.. ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వం వహిస్తున్నారని సమాచారం.

బతుకమ్మ పాట వీడియో అత్యంత అద్భుతంగా ఉంటుందని, ఇద్దరు దిగ్గజాలు కలిసి రూపొందించే ఈ పాట దేశ వ్యాప్తంగా ట్రెండ్ అయ్యే అవకాశం ఉందంటూ నెట్టింట చర్చ జరుగుతోంది. ఇది ప్రతి తెలంగాణవాసి గర్వించే అంశం అంటూ పలువురు సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు బతుకమ్మ సాంగ్ విడుదల అవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Next Story

Most Viewed