నవ్విస్తూనే ఏడిపించావ్.. మాజీ బాయ్‌ఫ్రెండ్‌కు అలియా మెసేజ్

by  |
నవ్విస్తూనే ఏడిపించావ్.. మాజీ బాయ్‌ఫ్రెండ్‌కు అలియా మెసేజ్
X

దిశ, సినిమా : ‘కార్గిల్ వార్’ హీరో, కెప్టెన్ విక్రమ్ బత్రా లైఫ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన ‘షేర్‌షా’ మూవీ టీమ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఫ్యాన్స్, క్రిటిక్స్‌తో పాటు సిద్ధార్థ్, కియారాల కోస్టార్స్ కూడా సినిమా చూసి అభినందిస్తున్నారు. తాజాగా బబ్లీ హీరోయిన్ అలియా భట్ సైతం తన మాజీ బాయ్‌ఫ్రెండ్ సిద్ధార్థ్‌తో పాటు కియారాను పొగుడుతూ ఇన్‌స్టా స్టోరీస్‌లో స్పెషల్ మెసేజ్ పోస్ట్ చేసింది. ‘ఈ సినిమా తనను నవ్వించింది, ఏడిపించింది, ఇంకా ఎన్నో ఎమోషన్స్‌కు గురిచేసింది. సిద్ధార్థ్ నువ్వు నాకు చాలా చాలా స్పెషల్ యార్! ఇలాగే ముందుకెళ్లు. బ్యూటిఫుల్ కియరా.. నువ్వు నిజంగానే ప్రకాశిస్తున్నావు’ అంటూ ఎమోషనల్ నోట్ షేర్ చేసింది. ఈ సందర్భంగా మూవీ టీమ్ అందరికీ కంగ్రాచ్యులేషన్స్ తెలిపిన అలియా.. లవ్‌లీ ఫిల్మ్ అంటూ కితాబిచ్చింది. కాగా ఇండిపెండెన్స్ డే సందర్భంగా న్యూఢిల్లీలోని కెప్టెన్ విక్రమ్ బత్రా మెమోరియల్‌కు వెళ్లిన సిద్ధార్థ్ మల్హోత్రా.. ఆయనకు నివాళులు అర్పించారు.



Next Story

Most Viewed