గంగూ.. నిన్ను ఎప్పటికీ మిస్ అవుతా : ఆలియా భట్

by  |
Alia-Bhatt-Gangubai-Kathiaw
X

దిశ, సినిమా : బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ ‘గంగూబాయి కతియావాడి’ షూటింగ్ కంప్లీట్ అయినట్లు పోస్ట్ పెట్టింది. ‘2019 డిసెంబర్‌ 8న షూటింగ్ ప్రారంభం కాగా.. రెండేళ్ల తర్వాత ప్రాజెక్ట్ పూర్తయినట్లు చెప్పింది. రెండు లాక్‌డౌన్స్, రెండు సైక్లోన్స్.. డైరెక్టర్, యాక్టర్‌కు కొవిడ్ పాజిటివ్.. సెట్ ఎదుర్కొన్న సమస్యలు.. మొత్తానికి గిగాంటిక్ లైఫ్ చేజింగ్ ఎక్స్‌పీరియన్స్’ అని తెలిపిన ఆలియా.. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో పనిచేయాలనుకున్న తన కల నెరవేరిందని చెప్పింది.

‘నేను ఈ సెట్ ‌నుంచి విభిన్నవ్యక్తిగా బయటకు వెళ్తున్నా.. లవ్ యూ సార్.. థాంక్ యూ’ అని పోస్ట్ పెట్టింది. ‘ఒక సినిమా ఎండ్ అయితే దానితో పాటు నాలోని ఒక పార్ట్ ఎండ్ అవుతుంది. ఈ రోజు అలాంటి అనుభవమే.. గంగు లవ్ యూ.. నిన్ను ఎప్పటికీ మిస్ అవుతా’ అంటూ సినిమాతో తనకున్న అనుబంధాన్ని పంచుకుంది.



Next Story

Most Viewed