ఆ హీరోయిన్ కంటే యూట్యూబర్స్, ఇన్‌స్టా రీల్స్ అమ్మాయిలే బెటర్!

by  |
Alia Bhatt
X

దిశ, సినిమా : బ్యూటిఫుల్ ఆలియా భట్ యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డ్యాన్సింగ్‌ స్కిల్స్‌తోనూ అదరగొట్టే భామ.. ప్రస్తుతం ఈ విషయంలో ట్రోల్స్ ఎదుర్కొంటోంది. రీసెంట్‌గా తన బెస్ట్ ఫ్రెండ్ అనుష్క రంజన్ వెడ్డింగ్‌లో పాల్గొన్న ఆలియా.. గర్ల్ గ్యాంగ్‌తో కలిసి రాణి ముఖర్జీ ‘ఛల్కా ఛల్కా రే’ సాంగ్‌కు డ్యాన్స్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆలియా అభిమానులు ఈ డ్యాన్స్ నంబర్‌కు ఫిదా కాగా.. కొందరు నెటిజన్లు మాత్రం భారీగా ట్రోల్ చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ వీడియోల్లో కనిపించే అమ్మాయిలు.. తనకన్నా బాగా పర్ఫార్మ్ చేస్తారని కామెంట్ చేస్తున్నారు. ‘ఓ గ్రేస్ లేదు, సింక్ లేదు.. బక్వాస్ పర్ఫార్మెన్స్’ అంటూ విమర్శిస్తున్నారు. ఇక తన అవుట్‌ఫిట్స్ గురించి ప్రస్తావించిన కొందరు.. ‘లెహంగాపై దుపట్టా వేసుకోకపోవడం కొత్త ట్రెండా?’ అని ప్రశ్నిస్తున్నారు.

పిచ్చెక్కిస్తున్న శ్రీముఖి..ఎగిరిపోతే ఎంత బాగుంటుంది

Samantha: రోజు రోజుకూ పెరుగుతున్న గ్లామర్ షో.. సమంత అందాల విందు వెనుక మ్యాటర్ ఏంటి..?


Next Story

Most Viewed