కరణ్ జోహార్ అడిగిన ప్రశ్నలకు తడబడిన ఆలియా.. వీడియో వైరల్

by  |
కరణ్ జోహార్ అడిగిన ప్రశ్నలకు తడబడిన ఆలియా.. వీడియో వైరల్
X

దిశ, సినిమా: ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ – ఆలియా భట్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘రాఖీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ’. ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించిన ఓ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. షూట్ మధ్యలో బ్రేక్ టైంలో ఆలియాను సరదాగ ఆటపట్టించాడు కరణ్. తను హోస్ట్‌గా వ్యవహారిస్తూ ఆలియాను కొన్ని ప్రశ్నలడుగుతూ వీడియో తీశాడు. ఈ వీడియోలో కరణ్‌.. ‘మనం ఇప్పుడు షూటింగ్‌ చేస్తున్నాం.. అవునా?’ అని ప్రశ్నించగా.. ఆలియా ‘అవును.. రాఖీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ సినిమా షూటింగ్‌’ అంటూ తడబడుతూ ఆన్సర్ ఇచ్చింది.

రాఖీ ఎక్కడ ఉన్నాడు? అంటే వర్కవుట్‌లో ఉన్నాడని చెప్పిన ఆలియా.. ఇలా నాలుగైదు ప్రశ్నలు చాలా వేగంగా అడగడంతో తడబడింది. దీంతో కరణ్ టంగ్‌ స్లిప్‌ అవుతుందేంటి అంటూ తనను ఆటపట్టించాడు. ఈ ఫన్నీ సన్నీవేశం చూసిన నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఆలియా కూడా తన మార్నింగ్ వర్కౌట్‌కు సంబంధించిన రెండు పిక్స్ షేర్ చేయగా.. అవి కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.



Next Story

Most Viewed