- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అతడు గొప్ప నాయకుడు : మొయిన్ అలీ
by Kema Shiva Kumar |
<p>దిశ, స్పోర్ట్స్ : ఎంఎస్ ధోని ఒక గొప్ప నాయకుడని.. అతడు ఎంతో మందికి సహాయం చేస్తాడని.. ఆయన సారథ్యంలో ఆడితే తాము మెరుగైన క్రికెటర్లుగా మారతామని చాలా మంది భావిస్తారని మొయిన్ అలీ అన్నాడు. ఐపీఎల్ 13వ సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడిన ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఆడుతున్నాడు. ధోని లాంటి నాయకుడి జట్టులో ఆడటం పట్ల చాలా ఉత్సాహంగా ఉన్నానని అలీ […]</p>

X
దిశ, స్పోర్ట్స్ : ఎంఎస్ ధోని ఒక గొప్ప నాయకుడని.. అతడు ఎంతో మందికి సహాయం చేస్తాడని.. ఆయన సారథ్యంలో ఆడితే తాము మెరుగైన క్రికెటర్లుగా మారతామని చాలా మంది భావిస్తారని మొయిన్ అలీ అన్నాడు. ఐపీఎల్ 13వ సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడిన ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఆడుతున్నాడు. ధోని లాంటి నాయకుడి జట్టులో ఆడటం పట్ల చాలా ఉత్సాహంగా ఉన్నానని అలీ చెప్పాడు. ‘ధోని సారథ్యంలో ఆడిన క్రికెటర్లు కొందరితో నేను మాట్లాడాను. తమలో ఉన్న లోపాలను సరిదిద్ది ఎలా మంచి క్రికెటర్లగా మార్చాడో వాళ్లు చెప్పారు. ఇది కేవలం గొప్ప నాయకులకే సాధ్యం. అతడి వద్ద ఆడేందుకు నేను చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను. ఏ జట్టుకైనా బలమైన నాయకుడు, కోచ్ ఉండటం కీలకమైన విషయం. సీఎస్కే అలాంటి నాయకుడు, కోచ్ చేతిలోనే ఉన్నది’ అని అలీ చెప్పుకొచ్చాడు.
Next Story






