రెచ్చిపోయిన మందుబాబులు.. విచక్షణ మరిచి అక్కడ తాగుతూ

by  |
రెచ్చిపోయిన మందుబాబులు.. విచక్షణ మరిచి అక్కడ తాగుతూ
X

దిశ, చిగురుమామిడి: చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి హామ్లెట్ గ్రామం లాలయ్యపల్లెలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మందుబాబులు హల్చల్ చేశారు. పాఠశాల అని కూడా లేకుండా ఇష్టారీతిలో మద్యం సేవించి, మందు బాటిళ్లను అక్కడ వదిలేయడమో, సీసాలను పగలుకొట్టడమో చేస్తున్నారు.రోజురోజుకు మందుబాబుల ఆగడాలు ఆగడం లేదని, మద్యంసేవిస్తూ, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడడం వల్ల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు మూట అనిల్ కుమార్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు చట్ల సమ్మయ్య ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఉన్నతస్థాయి అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసులు నిఘా పెట్టి, ఇక్కడ పరిస్థితులను చక్కబెట్టాలన్నారు.

Next Story