వనపర్తిలో రాత్రికి రాత్రే మద్యం పక్కదారి 

by  |
వనపర్తిలో రాత్రికి రాత్రే మద్యం పక్కదారి 
X

దిశ, మహబూబ్ నగర్
కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ను కొంత మంది మద్యం వ్యాపారులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. పోలీసులు వేసిన సీల్‌ను తొలగించి షాపులో ఉన్న మద్యాన్ని రాత్రికి రాత్రే పక్కదారి పట్టిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వనపర్తి జిల్లా ఆత్మకూరులోని శ్రీ కురుమూర్తి స్వామి వైన్స్‌‌‌కు ఆబ్కారీ పోలీసులు కొన్ని రోజుల క్రితం షెట్టర్లకు ఉన్న తాళలకు సీల్ వేశారు. వేసిన సీల్ తొలగించి రాత్రికిరాత్రే లోపల ఉన్న మద్యాన్ని అక్రమంగా తరలించారు. విషయం తెలుసుకున్న ఆత్మకూరు తహసీల్దార్, ఆబ్కారీ సీఐ విచారణ చేపట్టారు. వైన్స్ సీల్ తీయడంపై విచారణ చేసి రాత్రి పూట గస్తీ పోలీసులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Tags: Mahabubnagar, seal, Alcohol, Rushed, Investigation

Next Story