ట్రాన్స్‌జెండర్లపై ప్రేమను చూపించండి : అక్షయ్

by  |
ట్రాన్స్‌జెండర్లపై ప్రేమను చూపించండి : అక్షయ్
X

దిశ, వెబ్‌డెస్క్: అక్షయ్ కుమార్ కీలక పాత్రలో రాఘవ లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘లక్ష్మి’. కియారా అద్వానీ కథానాయిక. సూపర్ హిట్ చిత్రం ‘కాంచన’కు రీమేక్‌గా రూపొందిన ఈ సినిమా.. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని హాట్ స్టార్ వేదికగా నవంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. టీజర్‌లో అక్షయ్ కుమార్ నటనపై బాలీవుడ్‌లో ప్రశంసలు వెల్లువెత్తాయి. ఈ సినిమాలో తొలిసారి ‘ట్రాన్స్‌జెండర్’ పాత్రలో నటిస్తున్న అక్షయ్.. ట్రాన్స్‌జెండర్లపై ప్రేమ, సమతలను చూపించాలని తన ఇన్‌స్టా వేదికగా అభిమానులకు విన్నవించాడు. అంతేకాదు అందుకు ప్రతీకగా నిలిచే ఎర్రని బొట్టును తన నుదుట అలంకరించి.. ‘నా వంతుగా నేను చేశాను. ఇక మీరు కూడా ట్రాన్స్‌జెండర్ల ప్రేమను అందుకోండి. వారికి మద్ధతుగా నిలవండి’ అంటూ.. ‘అబ్ హామారీ బారీ హై’ అనే ఇన్‌స్టా ఫిల్టర్‌లో బొట్టును ధరించి తమ మద్దతును తెలియజేయాలని పిలుపునిచ్చాడు. అక్షయ్ అందుకు సంబంధించిన లింక్‌ను తన బయోలో ఇచ్చాడు.

ఇక సినిమా ప్రమోషన్ చేసేందుకు ‘లక్ష్మి’ టీమ్ ఢిల్లీ చేరుకోగా.. అందుకు సంబంధించిన ఫోటోను నిర్మాత తుషార్ కపూర్ పంచుకున్నాడు. అందులో అక్షయ్, కియారా, షబీనా ఖాన్‌లు ఉన్నారు.

Next Story

Most Viewed