అక్షయ్ నెక్స్ట్ మూవీ థియేటర్‌లోనే!

64

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. లాక్‌డౌన్ తర్వాత షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ‘బెల్ బాటమ్’ ఓటిటిలోనే రిలీజ్ అవుతుందనే న్యూస్ హల్ చల్ చేస్తుండగా..కొత్తగా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ‘బచ్చన్ పాండే’ అని అప్ డేట్ ఇచ్చాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను వచ్చే ఏడాది రిపబ్లిక్ డే రోజున రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించాడు. సినిమాకు సంబంధించిన లేటెస్ట్ పిక్ రిలీజ్ చేసిన అక్షయ్..ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్‌తో రానున్నట్లు అనౌన్స్ చేశాడు.

ఫర్హాద్ సంజీ డైరెక్షన్‌లో వస్తున్న సినిమాను సాజిద్ నడియాడ్ వాలా నిర్మిస్తుండగా.. కృతి సనన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, అర్షద్ వర్సి ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. అక్షయ్, అర్షద్ ఫస్ట్ టైం కలిసి నటించబోతుండగా..వీరిద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులకు సూపర్ ఫన్ అందించనుందట. ఈ మూవీలో గ్యాంగ్ లీడర్‌‌‌గా కనిపించనున్న అక్షయ్ వెండి తెరపై తనను తాను హీరోగా చూసుకోవాలని ప్రయత్నిస్తుండగా.. హీరోయిన్ కృతి డైరెక్టర్‌గా నిరూపించుకోవడమే లక్ష్యంగా ఉన్న యువతిగా కనిపించనుందని సమాచారం. సినిమాలోని ప్రతి క్యారక్టర్ సూపర్ డూపర్ కామెడీ టైమింగ్ తో సాగుతుందని..హండ్రెడ్ పర్సెంట్ పక్కా ఎంటర్టైన్మెంట్ అందిస్తుందని హామీ ఇస్తున్నారు ఫిల్మ్ మేకర్స్.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..