- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హీరో అక్షయ్‌కి షాకిచ్చిన ఎస్పీ
<p>దిశ, సినిమా: అక్షయ్ కుమార్, రణ్‌వీర్ సింగ్, అజయ్ దేవ్‌గన్ లీడ్ రోల్స్‌లో రోహిత్ శెట్టి డైరెక్ట్ చేస్తున్న ఫిల్మ్ ‘సూర్య వంశీ’. ఈ చిత్ర షూటింగ్‌కు సంబంధించి ట్విట్టర్‌లో అక్షయ్ కుమార్ పోస్ట్ చేసిన ఫొటోను ఓ ఐపీఎస్ ఆఫీసర్ తప్పుబట్టాడు. అక్షయ్ షేర్ చేసిన పిక్‌లో హయ్యర్ ఆఫీసర్స్ అక్షయ్, అజయ్ నిలబడి ఉంటే.. వారిపక్కన ఉన్న బల్లపై ఎస్ఐ ర్యాంక్ రణ్‌వీర్ సింగ్ కూర్చుని ఉన్నాడు. ఇదే విషయాన్ని ప్రశ్నించిన ఐపీఎస్ ఆఫీసర్ […]</p>

దిశ, సినిమా: అక్షయ్ కుమార్, రణ్‌వీర్ సింగ్, అజయ్ దేవ్‌గన్ లీడ్ రోల్స్‌లో రోహిత్ శెట్టి డైరెక్ట్ చేస్తున్న ఫిల్మ్ ‘సూర్య వంశీ’. ఈ చిత్ర షూటింగ్‌కు సంబంధించి ట్విట్టర్‌లో అక్షయ్ కుమార్ పోస్ట్ చేసిన ఫొటోను ఓ ఐపీఎస్ ఆఫీసర్ తప్పుబట్టాడు. అక్షయ్ షేర్ చేసిన పిక్‌లో హయ్యర్ ఆఫీసర్స్ అక్షయ్, అజయ్ నిలబడి ఉంటే.. వారిపక్కన ఉన్న బల్లపై ఎస్ఐ ర్యాంక్ రణ్‌వీర్ సింగ్ కూర్చుని ఉన్నాడు. ఇదే విషయాన్ని ప్రశ్నించిన ఐపీఎస్ ఆఫీసర్ ఆర్‌కే విజు.. రియల్ వరల్డ్‌లో సీనియర్ ఆఫీసర్స్ ముందు జూనియర్ ఆఫీసర్ ఇలా కూర్చుంటాడా? అంటూ ట్వీట్ చేశాడు.
అయితే ఆయన ట్వీట్‌కు రిప్లయ్ ఇచ్చిన అక్షయ్.. అది ‘బిహైండ్ ది సీన్స్ పిక్చర్’ అని తెలిపాడు. ఒక్కసారి కెమెరా ఆన్ అయిందంటే చాలు.. యాక్టర్స్ తమ ప్రోటోకాల్ ఫాలో అయితారని వెల్లడించాడు. పోలీసు బలగాలకు అభినందనలు తెలుపుతూ సినిమా తప్పకుండా నచ్చుతుందని హామీ ఇచ్చాడు. ఇదే పిక్చర్‌ను మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు షేర్ చేసిన కిలాడీ.. థియేటర్స్ ఓపెనింగ్‌కు అనుమతించినందుకు ధన్యవాదాలు తెలిపాడు.






