కిలాడి డబుల్ ధమాకా.. ఇండిపెండెన్స్ డే కానుకగా అక్షయ్ సినిమాలు

by  |
కిలాడి డబుల్ ధమాకా.. ఇండిపెండెన్స్ డే కానుకగా అక్షయ్ సినిమాలు
X

దిశ, సినిమా : బాలీవుడ్ కిలాడి అక్షయ్ కుమార్ అభిమానులకు ఎగ్జైట్మెంట్ న్యూస్ షేర్ చేశాడు. ‘సూర్యవంశీ’, ‘బెల్ బాటమ్’ చిత్రాలు కంప్లీట్ చేసిన హీరో.. సినిమాలు థియేటర్స్‌లో రిలీజ్ చేస్తాడా? ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ వైపు మొగ్గుచూపుతాడా? అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. రెండు సినిమాలు పూర్తయి ఏడాది గడుస్తున్నా థియేటర్స్‌కు రాకపోవడంతో నిరాశలో ఉన్నారు. ఈ క్రమంలో సినిమాల రిలీజ్ డేట్స్ అఫిషియల్‌గా అనౌన్స్ చేశాడు. సూర్యవంశీ, బెల్ బాటమ్ రెండు కూడా స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా విడుదల అవుతాయని ప్రకటించాడు. నిర్మాతల రిలీజ్ డేట్స్‌పై చర్చిస్తున్నారని, కొద్దిరోజుల్లో తేదీలు ఖరారు చేస్తామని తెలిపాడు.



Next Story

Most Viewed