రజత్ రాథోడ్‌ పాటకు ‘రౌడీ రాథోడ్’ ఫిదా

by Shyam |

<p>ఢిల్లీ పోలీస్ అధికారి రజత్ రాథోడ్‌.. ఇప్పటికే పలు పాటలు పాడి ఫేమస్ అయిన విషయం తెలిసిందే. గిటార్ ప్లే చేస్తూ.. రజత్ పాడే పాటలు నెటిజన్ల మనసు దోచుకోవడమే కాకుండా, ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్‌ను కూడా తెచ్చిపెట్టాయి. తాజాగా రజత్ ‘కాప్‌దట్‌సింగ్స్’ అనే హ్యష్‌ట్యాగ్‌తో బాలీవుడ్ హీరో అక్ష‌య్‌ కుమార్ ‘కేస‌రి’ సినిమాలోని ‘తేరి మిట్టీ..’ అనే సాంగ్‌ను పాడాడు. తను పాడిన పాటలను ఇప్పటికే ఎన్నోసార్లు అక్షయ్ కుమార్‌కు ట్వీట్ చేసిన రజత్.. అక్షయ్ [&hellip;]</p>

రజత్ రాథోడ్‌ పాటకు ‘రౌడీ రాథోడ్’ ఫిదా
X

ఢిల్లీ పోలీస్ అధికారి రజత్ రాథోడ్‌.. ఇప్పటికే పలు పాటలు పాడి ఫేమస్ అయిన విషయం తెలిసిందే. గిటార్ ప్లే చేస్తూ.. రజత్ పాడే పాటలు నెటిజన్ల మనసు దోచుకోవడమే కాకుండా, ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్‌ను కూడా తెచ్చిపెట్టాయి. తాజాగా రజత్ ‘కాప్‌దట్‌సింగ్స్’ అనే హ్యష్‌ట్యాగ్‌తో బాలీవుడ్ హీరో అక్ష‌య్‌ కుమార్ ‘కేస‌రి’ సినిమాలోని ‘తేరి మిట్టీ..’ అనే సాంగ్‌ను పాడాడు. తను పాడిన పాటలను ఇప్పటికే ఎన్నోసార్లు అక్షయ్ కుమార్‌కు ట్వీట్ చేసిన రజత్.. అక్షయ్ రిప్లై కోసం ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్నారు. ఎట్టకేలకు ఈసారి రజత్ పాడిన ‘మిట్టి తేరీ’ పాటకు అక్షయ్ స్పందించారు.

రజత్ పాడిన తీరుకు అక్షయ్ ఫిదా అయిపోయారు. ‘తేరి మిట్టీ పాట‌ను ఎన్నిసార్లు విన్నా నాకు గూజ్ బంప్స్ వ‌స్తాయి. నువ్వు పాడిన ఈ పాట కూడా అంతే. థాంక్యూ రజత్ ఫర్ షేరింగ్’ అని ట్వీట్ చేయడంతో పాటు రజత్ సింగింగ్ టాలెంట్‌ను మెచ్చుకుంటూ.. ఓ ప్రత్యేక వీడియో కూడా షేర్ చేశాడు అక్షయ్. ‘హాయ్ రజత్.. నేను అక్షయ్. నువ్వు చాలా బాగా పాడతావు. మంచి పాట పాడావు. నీ పాట విని నాకు ఎంతో సంతోషంగా అనిపించింది. నువ్వు పాడిన తీరుకు నాకు కన్నీళ్లు వచ్చాయి. నీ వాయిస్‌లో కూడా ఆ పెయిన్ ఉంది’ అంటూ అక్షయ్ వీడియో ద్వారా రజత్‌కు అభినందనలు తెలిపారు. డ్యూటీతో పాటు నీ టాలెంట్‌ను కూడా ఇలాగే కొనసాగించు అని తెలిపారు. రజత్‌ను అభినందిస్తూ క్లాప్స్ కూడా కొట్టారు అక్షయ్.

ఇక 2019లో వచ్చిన ‘కేసరి’ సినిమాలోని ‘తేరి మిట్టీ’ సాంగ్ చాలా పెద్ద హిట్ అయ్యింది. మ‌నోజ్ ముంటాసిర్ రాసిన ఈ పాట‌ను బీ ప్రాక్ పాడారు.

Next Story