కింగ్‌ను డైరెక్ట్ చేయనున్న కోలీవుడ్ స్టార్

by  |
కింగ్‌ను డైరెక్ట్ చేయనున్న కోలీవుడ్ స్టార్
X

కింగ్ నాగార్జున చివరగా మన్మథుడు-2లో కనిపించాడు. మన్మథుడు సినిమా రికార్డ్‌లు బ్రేక్ చేస్తే.. మన్మథుడు 2 మాత్రం డిజాస్టర్‌గా మిగిలిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఆచితూచి ప్రాజెక్ట్‌లు కమిటవుతున్నాడు నాగ్. ఇప్పటికే హిందీలో ‘బ్రహ్మాస్త్ర’ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుని ‘వైల్డ్ డాగ్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు సూపర్‌స్టార్ రజినీకాంత్ మేనల్లుడు, కోలీవుడ్ హీరో ధనుష్ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయబోతున్నాడని సమాచారం. రెండేళ్ల క్రితం ఆగిపోయిన బై లింగ్వల్ (తెలుగు, తమిళ్) ప్రాజెక్ట్‌ను సరికొత్తగా మళ్లీ పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తున్నాడట ధనుష్.

2018లో ‘నాన్ రుద్ర’ పేరుతో సినిమా తీసేందుకు ప్రయత్నించిన ధనుష్ కొన్ని కారణాల వల్ల షూటింగ్ మధ్యలోనే ఆపేశాడు. దీంతో ఆ ప్రాజెక్ట్ అలాగే ఉండిపోయింది. కానీ కంటెంట్ ఉన్న కథ కావడంంతో ధనుష్ ఈ ప్రాజెక్ట్ రీస్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నాడట. ఇప్పటికే దీని గురించి నిర్మాతలతో చర్చలు కూడా జరుపుతున్నాడట. 15వ శతాబ్దానికి చెందిన చారిత్రక కథాంశం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కింగ్ నాగ్ నటిస్తాడని సమాచారం. ఇప్పటికే ధనుష్‌ సినిమా స్టోరీ వినిపించగా కింగ్ ఓకే చెప్పేసినట్లు తెలుస్తుంది. మరో లీడ్ క్యారెక్టర్‌లో ధనుష్‌ కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడట.


Next Story

Most Viewed