దుమ్ములేపుతోన్న ‘లవ్ స్టోరీ’ ట్రైలర్..

by  |
sai-pallavi
X

దిశ, సినిమా : అక్కినేని వారసుడు నాగచైతన్య – సాయి పల్లవిల ‘లవ్ స్టోరి’ రిలీజ్ గురించి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఫైనల్‌గా సెప్టెంబర్ 24న మూవీ రిలీజ్ కాబోతుండగా.. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. లైఫ్‌లో సెటిల్ కావాలని ఆరాటపడే అమ్మాయి, అబ్బాయి ప్రేమలో పడటం.. ఆ తర్వాత పెద్దలను ఎదిరించి ప్రేమను కాపాడుకునేందుకు చేసే పోరాటమే ‘లవ్ స్టోరి’ కథ. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న సినిమాపై ఇప్పటికే ఎక్స్‌పెక్టేషన్స్ హై లెవల్‌లో ఉండగా.. ట్రైలర్ చూశాక మూవీ సెన్సేషనల్ హిట్ అవుతుందని అభిప్రాయపడుతున్నారు నెటిజన్లు. ఒకప్పుడు చైతును కనీసం హీరోగా యాక్సెప్ట్ చేయని ప్రేక్షకులు ఇప్పుడు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ట్రైలర్‌లో ప్రతీ డైలాగ్ హార్ట్ టచింగ్‌గా ఉండగా.. చైతు డాన్సింగ్ స్కిల్స్ గురించి స్పెషల్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఇక పవన్ సీహెచ్ మ్యూజిక్‌ మూవీని మరో లెవల్‌కు తీసుకెళుతుందని చెప్పొచ్చు.


Next Story

Most Viewed