ప్రపంచంలోనే కొత్త ఫార్మాట్‌లో అఖిల్ ప్రీలుక్

by  |
ప్రపంచంలోనే కొత్త ఫార్మాట్‌లో అఖిల్ ప్రీలుక్
X

దిశ, సినిమా: బిగ్ బాస్ ఫేమ్ అఖిల్ సార్థక్ ఉగాది సందర్భంగా కొత్త సినిమా ప్రకటించాడు. ఇంతకుముందు మోనాల్ గజ్జర్‌తో కలిసి వెబ్ సిరీస్ అనౌన్స్ చేసిన అఖిల్.. ఇప్పుడు వినూత్న ప్రేమకథ ‘ఫస్ట్ టైమ్‌’‌తో వెండితెరకు పరిచయం కాబోతున్నట్లు తెలిపాడు. అనిక విక్రమన్ హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రానికి ఐ.హేమంత్ దర్శక, నిర్మాత కాగా.. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో సినిమాను లాంచ్ చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హాజరైన ఎమ్మెల్యే రఘునందన్ రావు.. ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, డైరెక్టర్ జి. నాగేశ్వర్ రెడ్డి కెమెరా స్విచాన్ చేశారు. ఇక ఫస్ట్ షాట్ దర్శకత్వం వహించిన నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ.. సినిమా బిగ్ సక్సెస్ కావాలని కోరుకున్నారు. ఈ సినిమాతో అఖిల్ పెద్ద హీరో అవుతాడన్న దర్శక, నిర్మాత హేమంత్.. కర్ణాటకలోని అప్సర కొండ బీచ్‌లో ఫస్ట్ షెడ్యూ్ల్ ప్లాన్ చేసినట్లు తెలిపారు. ప్రపంచంలోనే కొత్త ఫార్మాట్‌లో ప్రీలుక్ రిలీజ్ చేయాలని అనుకుంటున్నామని, ఈ రొమాంటిక్ అడ్వెంచరస్ మూవీని ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామన్నారు.


Next Story

Most Viewed