బిందాస్ డైరెక్టర్‌తో అఖిల్?

by  |
బిందాస్ డైరెక్టర్‌తో అఖిల్?
X

అఖిల్ అక్కినేని.. మొదటి సినిమా ‘అఖిల్’తో పర్ఫార్మెన్స్ పరంగా పరవాలేదనిపించినా, రిజల్ట్ మాత్రం తేడాకొట్టింది. ఆ తర్వాత సినిమాలతో అయినా హిట్ అందుకుంటాడా అంటే.. వరుసగా హలో, మిస్టర్ మజ్ను చిత్రాలతో కూడా నిరాశపరిచాడు. అక్కినేని వారసుడిగా ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్‌తో పాటు స్టార్ డైరెక్టర్లతో పని చేసినా సరే.. లక్కు కలిసిరాక చేసిన మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద చతికిలబడ్డాయి.

ఇప్పటికీ తానేంటో ప్రూవ్ చేసుకోలేకపోయిన అఖిల్.. నెక్స్ట్ సినిమా ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’తో ఖచ్చితంగా ప్రేక్షకులను మెప్పిస్తాననే ధీమాతో ఉన్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్. అయితే ఈ సినిమా ఇంకా విడుదల కాక ముందే మరో మూవీని లైన్‌లో పెట్టాడు అఖిల్. లాక్‌డౌన్‌లో చాలా కథలు విన్న ఈ హ్యాండ్సమ్ హీరో.. దర్శకుడు వీరు పోట్ల స్టోరీ లైన్‌కు ఇంప్రెస్ అయినట్లు తెలిసింది. స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేయమన్న అఖిల్.. తన తర్వాతి చిత్రం వీరు పోట్ల డైరెక్షన్‌లోనే చేయబోతున్నాడని టాక్.

వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రాలకు రచయితగా పని చేసిన వీరు పోట్ల.. బిందాస్ సినిమాతో డైరెక్టర్‌గా మారారు. ‘రగడ, దూసుకెళ్తా, ఈడు గోల్డ్ ఎహే’ చిత్రాలు చేసినా సరైన హిట్ దక్కించుకోలేక పోయాడు. అఖిల్‌తో సినిమా అయినా బ్లాక్ బస్టర్ అవుతుందేమో చూడాలి మరి.

Next Story

Most Viewed