అఖిల్‌ లవ్ యూ.. మొత్తానికి సాధించావ్‌: చరణ్

by  |
ccc
X

దిశ, సినిమా : మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, అఖిల్ అక్కినేని మంచి స్నేహితులు అనే విషయం తెలిసిందే. అయితే అఖిల్‌ను సపోర్ట్ చేసేందుకు ఎప్పుడూ ముందుండే చెర్రీ.. తన లేటెస్ట్ పిక్చర్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ సినిమాపై కాంప్లిమెంటరీ ట్వీట్ చేశాడు. మూవీ సక్సెస్‌తో చాలా హ్యాపీగా ఉందన్న చరణ్.. అఖిల్ పర్ఫార్మెన్స్‌కు ఫిదా అయ్యానని, హీరోయిన్ పూజా హెగ్డే మరోసారి తానేంటో ప్రూవ్ చేసిందన్నాడు. అలాగే నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ 2, దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్‌కు కంగ్రాట్స్ చెప్పాడు. ఈ మధ్య ఇన్‌స్టా లైవ్‌లో చెర్రీ గురించి ప్రస్తావించిన అఖిల్.. చరణ్ తన అన్న అని, బ్రదర్ ఫర్ లైఫ్ అని తెలిపాడు. ఈ ట్వీట్‌తో ఖుష్ అవుతున్న అక్కినేని అండ్ మెగా ఫ్యాన్స్.. ఈ రిలేషన్ షిప్ ఇలాగే కంటిన్యూ కావాలని కోరుకుంటున్నారు.

https://twitter.com/AlwaysRamCharan/status/1450342664390516736?s=20



Next Story

Most Viewed