మీ ఫ్యామిలీ ఫొటోనే నాకు మీరిచ్చే గిఫ్ట్: అఖిల్

by  |
మీ ఫ్యామిలీ ఫొటోనే నాకు మీరిచ్చే గిఫ్ట్: అఖిల్
X

అఖిల్ అక్కినేని ప్రస్తుతం మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్ సినిమా చేస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ కాగా… సినిమా ఫస్ట్ లుక్, సాంగ్ ఇప్పటికే ప్రేక్షకాదారణ పొందాయి. బుధవారం అఖిల్ పుట్టినరోజు కాగా… ఇప్పుడున్న పరిస్థితుల్లో బర్త్ డే వేడుకలు జరుపుకునేందుకు సిద్ధంగా లేనని తెలిపారు. అభిమానులు కూడా పోస్టర్లు, కట్ ఔట్స్ లాంటివి పెట్టించొద్దని సూచించారు. ఇంట్లోనే మీ కుటుంబాలతో జాగ్రత్తగా ఉండాలని కోరారు అఖిల్. జన్మదినం సందర్భంగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా నుంచి వీడియో రిలీజ్ చేద్దామని దర్శక, నిర్మాతలు కోరినా.. నేను వద్దని చెప్పానని తెలిపారు. దయచేసి అభిమానులు అర్ధం చేసుకోవాలని కోరారు.

పుట్టినరోజు సందర్భంగా నా ఫ్యామిలీ స్పెషల్ ఫోటోను మీతో సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటానని తెలిపిన అఖిల్… మీరు కూడా నాకోసం మీరు మీ ఫ్యామిలీతో దిగిన ఫోటోలను నాతో షేర్ చేసుకోవాలని కోరారు. మీరు మీ కుటుంబాలతో ఇంటి దగ్గర సంతోషంగా ఉండడమే నా బర్త్ డే గిఫ్ట్ గా భావిస్తానని తెలిపారు అఖిల్.

Tags: Akhil Akkineni, most eligible bachelor, pooja Hegde

Next Story

Most Viewed