‘యాక్షన్’ ప్లాన్ చేసిన అఖిల్?

by  |
‘యాక్షన్’ ప్లాన్ చేసిన అఖిల్?
X

‌దిశ, వెబ్‌‌డెస్క్: అక్కినేని అఖిల్‌కు తన సినీ కెరియర్‌లో ఇప్పటివరకు సరైన హిట్ పడలేదు. ఈసారైనా హిట్ కొడుతాడేమోనని ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ అనుకుంటూనే ఉన్నా, ఆ సమయం మాత్రం రావట్లేదు. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్‌లో వస్తున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాతోనైనా ఆ ఆశ నెరవేరాలని.. హీరోయిన్ పూజా హెగ్డే అయినా తన లక్కీ చార్మ్ కావాలని.. బ్లాక్ బస్టర్ హిట్ పడాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్. ఈ మూవీ షూటింగ్ ఆల్రెడీ కంప్లీట్ కాగా సమ్మర్‌లో రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. దీంతో పాటు సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నెక్స్ట్ సినిమా అనౌన్స్ చేశాడు అఖిల్. ఇది కాకుండా మరో మూవీ కూడా కమిట్ అయ్యాడని సమాచారం.

‘ది ఫ్యామిలీ మాన్’ సిరీస్ డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకే డైరెక్షన్‌లో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. యాక్షన్ జోనర్‌లో మూవీ రూపుదిద్దుకుంటుంన్నట్టుగా తెలుస్తోంది. కాగా రాజ్ అండ్ డీకే ఇప్పటికే హిందీలో మరో సిరీస్ చేస్తున్నారని సమాచారం. షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో వస్తున్న సిరీస్‌లో రాశి ఖన్నా ఫిమేల్ లీడ్‌గా సెలెక్ట్ కాగా, ఈ సిరీస్ పూర్తయ్యాకే అఖిల్‌ను డైరెక్ట్ చేసే ఛాన్స్ ఉండగా.. అఫిషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది.



Next Story