సామ్ బాటలో అఖిల్..

by  |
సామ్ బాటలో అఖిల్..
X

అఖిల్ అక్కినేని.. వారసత్వంతో సినిమాల్లోకి సులభంగా ఎంట్రీ ఇవ్వగలిగినా హిట్ మాత్రం కొట్టలేక పోతున్నాడు. తీసిన మూడు సినిమాలు యావరేజ్‌గా నిలవగా.. నాలుగో సినిమాతో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై రూపుదిద్దుకున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టి చూపించాలని వెయిట్ చేస్తున్నాడు. సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ కాగా.. బుధవారం విడుదలైన పోస్టర్ ఆకట్టుకుంది. సంక్రాంతికి సినిమా విడుదల కానుంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు అఖిల్ వదిన సమంతను ఫాలో అవుతున్నట్లు సమాచారం. సామ్ ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్‌లో నటించిన విషయం తెలిసిందే. అదే బాటలో అఖిల్ కూడా ఓ వెబ్ సిరీస్ చేయబోతున్నాడని టాక్. హిందీలో సిరీస్ ప్లాన్ చేస్తున్న మేకర్స్.. ఇందులో మెయిన్ రోల్ కోసం అఖిల్‌ను సంప్రదించారని తెలుస్తోంది. హ్యాండ్సమ్ అఖిల్‌కు రాక్ స్టార్ రోల్‌ను ఆఫర్ చేశారట. ఈ పాత్రకు అఖిల్ పర్ఫెక్ట్‌గా సెట్ అవుతాడనే ఉద్దేశంతో ఉన్నారట దర్శక, నిర్మాతలు.

Next Story