హిందీలోనూ 'ఆకాశమే నీ హద్దురా'!

by Shyam |

<p>దిశ, వెబ్ డెస్క్: తమిళ్‌స్టార్ బ్రదర్స్ సూర్య, కార్తీల సినిమాలు వరుసగా హిందీలో రీమేక్ అవుతున్నాయి. కార్తి హీరోగా వచ్చిన &#8216;ఖైదీ&#8217; సినిమా ఇప్పటికే హిందీలో రీమేక్ చేస్తున్నట్లు ప్రకటించాయ్ రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, డ్రీమ్ వారియర్ పిక్చర్స్. కార్తి పాత్రలో అజయ్ దేవగన్‌ను ఫైనలైజ్ చేశారట కూడా. ఇదిలా ఉంటే.. సుధ కొంగర డైరెక్షన్‌లో సూర్య కొత్త చిత్రం &#8216;సూరరై పోట్రు&#8217;. తెలుగులో &#8216;ఆకాశమే నీ హద్దురా&#8217; టైటిల్‌తో వస్తున్న ఈ చిత్రం ఒక మధ్యతరగతి యువకుడు [&hellip;]</p>

హిందీలోనూ ఆకాశమే నీ హద్దురా!
X

దిశ, వెబ్ డెస్క్: తమిళ్‌స్టార్ బ్రదర్స్ సూర్య, కార్తీల సినిమాలు వరుసగా హిందీలో రీమేక్ అవుతున్నాయి. కార్తి హీరోగా వచ్చిన ‘ఖైదీ’ సినిమా ఇప్పటికే హిందీలో రీమేక్ చేస్తున్నట్లు ప్రకటించాయ్ రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, డ్రీమ్ వారియర్ పిక్చర్స్. కార్తి పాత్రలో అజయ్ దేవగన్‌ను ఫైనలైజ్ చేశారట కూడా.

ఇదిలా ఉంటే.. సుధ కొంగర డైరెక్షన్‌లో సూర్య కొత్త చిత్రం ‘సూరరై పోట్రు’. తెలుగులో ‘ఆకాశమే నీ హద్దురా’ టైటిల్‌తో వస్తున్న ఈ చిత్రం ఒక మధ్యతరగతి యువకుడు ఎయిరోప్లేన్ కంపెనీని స్థాపించేందుకు చేసిన ప్రయాణంలో ఎదుర్కొన్న సంఘటనల ఆధారంగా రూపొందుతుంది. పైలట్ ఆఫీసర్ చంద్ర మహేష్ కనయనం జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీని కూడా హిందీలో రీమేక్ చేస్తున్నారట. బాలీవుడ్‌లో సిఖ్యా ఎంటర్టైన్మెంట్ పతాకంపై గునీత్ మోంగా సినిమాను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తుండగా నటీనటులు, టెక్నీషియన్ల ఎంపిక పూర్తి కాగానే అధికారిక ప్రకటన ఇస్తారని సమాచారం.

Next Story