సౌత్ ఆడియన్స్‌పై ఆకాంక్ష సింగ్ కామెంట్స్

by  |
Akanksha Singh
X

దిశ, సినిమా: బ్యూటిఫుల్ ఆకాంక్ష సింగ్ ‘మళ్లీ రావా’, ‘దేవ్‌దాస్’, ‘పైల్వాన్’ సినిమాలతో సౌత్ ఇండస్ట్రీని ఆకట్టుకుంది. లాక్‌డౌన్‌‌లో సైతం పలు ప్రాజెక్టులపై వర్క్ చేసిన ఆకాంక్ష.. జూలై 2020 నుంచి బిజీగానే ఉంది. ఈ విషయంపై స్పందించిన భామ.. పాండమిక్ టైమ్‌లోనూ వర్క్ చేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపింది. కానీ ఇప్పటి వరకు షూట్ చేసిన ప్రాజెక్ట్స్ ఒక్కటి కూడా రిలీజ్ కాకపోవడం ఆందోళన కలిగించే విషయమేనని చెప్పింది. ప్రస్తుత సిచ్యువేషన్‌లో బాలీవుడ్ మేకర్స్ ఓటీటీ రిలీజ్‌కు మొగ్గుచూపుతున్నారని, కానీ సౌత్ ఇండస్ట్రీ మాత్రం థియేట్రికల్ రిలీజ్ కోసమే ఎదురుచూస్తోందని వివరించింది. అక్కడి ప్రజలు సినిమాను బిగ్ స్క్రీన్‌పై చూసేందుకే ఇష్టపడతారని, అందుకే మేకర్స్ కూడా అదే ప్లాన్ చేస్తున్నారన్న ఆకాంక్ష.. తనకు కూడా అదే కావాలని అంటోంది. ఈ క్రమంలో ఆకాంక్ష తమిళ్ డెబ్యూ మూవీ ‘క్లాప్’తో పాటు తెలుగు ఆంథాలజీ ‘మీట్ క్యూట్‌’ను లాక్‌డౌన్‌లోనే కంప్లీట్ చేసింది. ఇక బాలీవుడ్ ప్రాజెక్ట్ ‘మే డే’లోనూ నటించిన భామ.. ప్రస్తుతం తెలుగు వెబ్ సిరీస్ షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు తెలిపింది. మరో బాలీవుడ్ సిరీస్‌పై చర్చలు జరుగుతున్నట్లు చెప్పింది.


Next Story

Most Viewed