అనురాగ్ కశ్యప్ సినిమాలన్నీ కాపీనే! : అనిల్ కపూర్

by  |
అనురాగ్ కశ్యప్ సినిమాలన్నీ కాపీనే! : అనిల్ కపూర్
X

దిశ, వెబ్‌డెస్క్: మిస్టర్ ఇండియా అనిల్ కపూర్, డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ఏకే వర్సెస్ ఏకే(AK vs AK )’. బ్లాక్ కామెడీ థ్రిల్లర్‌గా వస్తున్న సినిమాను విక్రమాదిత్య మొత్వాని డైరెక్ట్ చేయగా.. అనిల్ కపూర్ కూతురు సోనమ్ కపూర్, కొడుకు హర్షవర్ధన్ కపూర్ సపోర్టింగ్ రోల్స్‌లో కనిపించబోతున్నారు. డిసెంబర్ 24న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్‌ను కాస్త డిఫరెంట్‌గా డిజైన్ చేశారు ఫిల్మ్ మేకర్స్. ఫస్ట్ ప్రమోషన్‌లో ట్విట్టర్ వేదికగా అనురాగ్, అనిల్ కపూర్ మాటల యుద్ధం నిజంగానే ఇద్దరి మధ్య గొడవ జరిగిందనేంతలా నమ్మించి సక్సెస్ కాగా.. సెకండ్ ప్రమోషనల్ వీడియోలో ఇద్దరూ ఇళ్లను మార్చుకుని చేసిన హోమ్ టూర్‌లో సెటైర్స్ వేసుకున్నారు.

అనిల్ కపూర్ మూడంతస్థుల బంగ్లాను చూపిస్తూ ఎంత విలాసవంతమైన లైఫ్ లీడ్ చేస్తున్నాడో అని అనురాగ్ కశ్యప్ సెటైరికల్ వేలో తెలపగా.. అనురాగ్ ఇంట్లో ఉన్న డీవీడీలు చూపిస్తూ వరల్డ్ బెస్ట్ డీవీడీ కలెక్షన్ అని కాంప్లిమెంట్స్ ఇచ్చినా.. ఇంత గొప్ప సినిమాలు కాపీ చేస్తూ కూడా అనురాగ్ వరెస్ట్ ఫిల్మ్స్ చేస్తున్నాడని అన్నారు అనిల్ కపూర్. వేరే భాషల్లోని సినిమాలు చూసి అదే సినిమాను బాలీవుడ్‌లో చేస్తూ మనల్ని పిచ్చోళ్లను చేస్తున్నాడన్నారు. మొత్తానికి ఒకరి మీద ఒకరు సెటైర్ వేసుకుంటూ సాగిన వీడియో ఫుల్ కామెడీతో నిండి ఉండగా.. అసలు ఎందుకు ఇలాంటి ప్రమోషన్స్ చేస్తున్నామో అర్థం కాని పరిస్థితిలో ఉన్నా గానీ.. సినిమా వెయిటేజ్‌ పెంచుతుంది కాబట్టి తప్పట్లేదని చెప్తున్నారు ఏకే అండ్ ఏకే.

Next Story

Most Viewed