‘ఖైదీ’గా అజయ్ దేవగన్!

43

కోలీవుడ్ హీరో కార్తీ నటించిన చిత్రం ‘ఖైదీ’. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు సాధించిన ఈ సినిమాలో కార్తీ నటనకు ప్రేక్షకులు సైతం ఫిదా అయ్యారు. పుట్టినప్పటి నుంచి బిడ్డను చూసేందుకు ఆరాటపడుతున్న ఓ ఖైదీ(కార్తీ) తన కూతురును చూసేందుకు వెళ్లే క్రమంలో పోలీసులకు ఎందుకు సాయం చేయాల్సి వచ్చింది ? వాళ్లతో ఉన్న డీల్ ఏంటి ? అనేది కథ. కాగా.. ఈ సినిమాలో బిడ్డ కోసం కార్తీ పడే తపన కంటతడి పెట్టిస్తుంది. అలాంటి ఎమోషన్ సీన్స్‌కు ప్రేక్షకులు పూర్తిగా కనెక్ట్ అయిపోతారు. అంతేకాదు సినిమాలో యాక్షన్ సీన్స్ కూడా చాలా స్పెషల్‌గా ఉంటాయ్. సౌత్‌లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ చిత్రం.. ఇప్పుడు హిందీలో రీమేక్ చేస్తున్నారు.

అజయ్ దేవగన్ ఫిల్మ్స్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అజయ్ దేవ్‌గన్ హీరో. ఒరిజినల్‌లో కార్తీ చేసిన పాత్రలో అజయ్ నటిస్తుండగా.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు. 12 ఫిబ్రవరి, 2021లో సినిమాను విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మూవీ అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌తో అజయ్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. గ్రేట్ స్టోరీ సెలెక్ట్ చేసుకున్నాడని, సినిమా బ్లాక్ బస్టర్ బిజినెస్ చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..