పోలీస్ ఆఫీసర్ ‘రుద్ర’గా అజయ్ దేవగణ్ డిజిటల్ ఎంట్రీ

by  |
పోలీస్ ఆఫీసర్ ‘రుద్ర’గా అజయ్ దేవగణ్ డిజిటల్ ఎంట్రీ
X

దిశ, సినిమా : బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో అజయ్ దేవగణ్. శక్తిమంతమైన పోలీసు పాత్రలు పోషించడంతో పాటు ఎంటర్‌టైన్‌మెంట్‌కు కేరాఫ్‌గా నిలిచిన అజయ్ త్వరలో డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్, బీబీసీ స్టూడియోస్ సంస్థలు ‘రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్’ అనే సిరీస్ రూపొందిస్తున్నాయి. ఇందులో అజయ్ లీడ్ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చేశాయి సంస్థలు. బ్రిటీష్ వెబ్ సిరీస్ ‘లూథర్’ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సిరీస్‌కు రాజేశ్ మపుస్కర్ డైరెక్టర్. ఇక ‘రుద్ర’ ద్వారా డిజిటల్ ఇంట్రీ ఇవ్వబోతున్నందుకు తను ఆనందపడుతున్నట్లు అజయ్ దేవగణ్ ట్విట్టర్ వేదికగా తెలిపారు.

తన కెరీర్‌లో ఇప్పటికే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్స్ రోల్స్ ప్లే చేసిన అజయ్.. ఈ సిరీస్‌లో ఇంకా స్పెషల్‌గా కనిపించనున్నారు. కాగా ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి డైరెక్షన్‌లో వస్తోన్న ‘ఆర్ఆర్ఆర్’తో అజయ్ టాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.


Next Story

Most Viewed