మోస్ట్ సర్చ్‌డ్ లిస్ట్‌లో ఐకాన్ స్టార్

by  |
మోస్ట్ సర్చ్‌డ్ లిస్ట్‌లో ఐకాన్ స్టార్
X

దిశ, సినిమా : బాలీవుడ్ సీనియర్ హీరో అజయ్ దేవగన్ యూట్యూబ్‌లో మోస్ట్ సర్చ్‌డ్ ఇండియన్ యాక్టర్‌గా నిలిచాడు. గత పన్నెండు నెలల డేటా ప్రకారం గూగుల్ ట్రెండ్స్ రిలీజ్ చేసిన లిస్ట్‌లో ఆయన ఫస్ట్ ప్లేస్‌లో ఉండగా.. ఆ తర్వాతి స్థానాల్లో సల్మాన్ ఖాన్, అల్లు అర్జున్, అమితాబ్ బచ్చన్, తలపతి విజయ్ ఉన్నారు. కాగా అజయ్ దేవగన్ కొవిడ్ మహమ్మారి సమయంలో బాధితులకు ఆర్థికంగా సహాయం అందించడంలో ముందున్నారు. వ్యాక్సిన్ క్యాంప్‌లు, ఐసీయూ యూనిట్స్ ఏర్పాటు చేసిన సూపర్ స్టార్.. పాండమిక్ టైమ్‌లో ఆపద్భాంధవుడు అయ్యారు.

ఇదిలా ఉంటే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ స్పెషల్ సిరీస్ ‘రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్’ ద్వారా డిజిటల్ ఎంట్రీ ఇస్తున్న అజయ్.. ఇందుకోసం రూ. 130 కోట్లు తీసుకుంటున్నారని టాక్. దీంతో డిజిటల్ షోస్‌కు హయ్యెస్ట్ పెయిడ్ యాక్టర్‌గా రికార్డ్ సృష్టించిన అజయ్.. జూలై మిడిల్‌లో ఈ సిరీస్ షూటింగ్ ప్రారంభించనున్నారు. ఆ లోపు ఇంతకు ముందు కమిట్ అయిన ప్రాజెక్ట్‌లు పూర్తిచేసేందుకు ట్రై చేస్తున్నారు. కాగా ‘రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్’ బ్రిటిష్ డ్రామా సిరీస్ ‘లూథర్’ అఫిషియల్ రీమేక్‌గా తెరకెక్కుతోంది.



Next Story

Most Viewed