నివేద ప్లేస్ భర్తీ చేసిన ఐశ్వర్య

by  |
నివేద ప్లేస్ భర్తీ చేసిన ఐశ్వర్య
X

దిశ, వెబ్‌డెస్క్ : సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ఈ మధ్యే సక్సెస్ గాడిలో పడ్డాడు. ఇటీవలే ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా షూటింగ్ పూర్తి చేసిన తేజ్.. ప్రస్తుతం దేవకట్టా డైరెక్షన్‌లో సినిమా చేస్తున్నాడు. తేజ్‌కు ఇది 14వ చిత్రం కాగా, ఆల్రెడీ హోమ్ వర్క్ కంప్లీట్ అయింది. కొద్ది రోజుల క్రితం షూటింగ్ కూడా స్టార్ట్ కాగా.. ఈ సినిమాలో సౌత్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నట్లు తనే సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

అయితే ఈ సినిమాలో ముందుగా నివేదా పేతురాజ్‌ను హీరోయిన్‌గా అనుకున్నారు. కానీ కరోనా కారణంగా ఆల్రెడీ ఒప్పుకున్న ప్రాజెక్టులకు డేట్స్ సర్దుబాటు చేయలేక.. ఈ ప్రాజెక్ట్ నుంచి నివేద తప్పుకున్నట్టు సమాచారం. దీంతో ఈ సినిమా చాన్స్ వరల్డ్ ఫేమస్ లవర్ స్టార్ ఐశ్వర్య కొట్టేసినట్టు తెలుస్తోంది. కాగా నటనా ప్రాధాన్యమున్న ఈ సినిమా.. ఐశ్వర్య కెరియర్‌లో మరో సూపర్ క్యారెక్టర్ అవుతుందని అంటున్నారు విశ్లేషకులు. ఇక తేజ్ పుట్టినరోజు సందర్భంగా విషెస్ తెలిపిన డైరెక్టర్ దేవకట్టా.. సినిమాలో తన లుక్ గురించి రివీల్ చేశారు. అభిగా తేజ్‌ను ఇంట్రడ్యూస్ చేస్తూ చిన్న గ్లింప్స్ ఇచ్చారు.



Next Story

Most Viewed