అన్నిరకాల సేవలు @ ‘వన్ ఎయిర్‌టెల్’

by  |
అన్నిరకాల సేవలు @ ‘వన్ ఎయిర్‌టెల్’
X

ఎయిర్‌టెల్ వినియోగదారులకు శుభవార్త. అన్నిరకాల సేవలను ఒకే గొడుగు కిందకు తీసుకురానుంది. పోస్ట్ పేయిడ్, ఫైబర్, ల్యాండ్ లైన్, డీటీహెచ్ వంటి పలు సేవలు ఇకపై ‘వన్ ఎయిర్‌టెల్’ పేరుతో కస్టమర్లకు అందించనుంది. ఈ సరికొత్త ప్లాన్‌కు సంబంధించి దేశవ్యాప్తంగా ప్రచారం కోసం ఇప్పటికే హోర్డింగ్స్ పెట్టినట్లు టెలికామ్‌టాక్ ఇన్ఫో తెలిపింది. ఈ సరికొత్త ప్లాన్‌ను మార్చి25న ఎయిర్ టెల్ ప్రారంభిస్తున్నట్లు సమాచారం. మొదటగా దేశంలోని రెండు మూడు ప్రాంతాల్లో ప్రారంభించి ఆ తరువాత దేశవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు 91 మొబైల్స్ తెలిపింది. వన్ ఎయిర్ టెయిల్‌తో కస్టమర్లకు కాల్ సెంటర్ వినియోగానికి ఎటువంటి చార్జీ ఉండదు. వివిధ శ్రేణుల్లో కూడా ప్లాన్‌లు లభించనున్నాయి.

అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్‌తో పోస్ట్‌పెయిడ్ ప్లాన్, రోల్‌ఓవర్ సపోర్ట్‌తో 85 జీబీ డేటా, రూ .500 విలువైన ఎయిర్‌టెల్ డిజిటల్ హెచ్‌డీ ప్యాక్, 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఎయిర్‌టెల్ ఫైబర్ ప్లాన్, 500 జీబీ డేటాగా బేస్ ప్లాన్ నిర్ణయించారు. వన్ ఎయిర్‌టెల్ వినియోగదారులు అన్ లిమిటెడ్ ల్యాండ్‌లైన్ కాల్స్‌ను ఉచితంగా పొందవచ్చు.
91 మొబైల్స్ ప్రకారం ‘వన్ ఎయిర్‌టెల్’ ప్రారంభ ప్లాన్ ధర 1000 కాగా, మరో రెండు ప్లాన్‌లు రూ.1500, రూ.200 గా ఉండనున్నట్లు తెలుస్తోంది.

Tags: airtel, one airtel, new plan, business news


Next Story

Most Viewed