Airtel యూజర్ల కోసం సరికొత్త ప్లాన్

by  |
airtel
X

దిశ, వెబ్‌డెస్క్: Airtel తన యూజర్ల కోసం సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను మొదలుపెట్టింది. 77 రోజుల వాలిడిటీతో రూ.666 ప్లాన్‌ను తీసుకొచ్చింది. టెలికాం ఆపరేటర్ దేశంలో తన ప్రీపెయిడ్ మొబైల్ టారిఫ్‌లను పూర్తిగా సవరించిన తర్వాత ఈ ప్లాన్‌ను కొత్తగా ప్రారంభించింది. Airtel యూజర్లకు ఈ ప్లాన్ ద్వారా మంచి ఆఫర్లు కూడా అందించనుంది. ఈ ప్లాన్ గురించి పూర్తి వివరాలు మీకోసం..

Airtel కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ రూ.666 తో రోజు 1.5 GB డేటా, అన్ని నెట్‌వర్క్‌లకు అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలు అందిస్తోంది. వినియోగదారులు హై-స్పీడ్ రోజువారీ డేటా పరిమితిని చేరుకున్న తర్వాత, బ్రౌజింగ్ వేగం 64kbpsతో వస్తుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 77 రోజులు. వీటితో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్‌కు ఒక నెల ట్రయల్, మూడు నెలల పాటు అపోలో 24/7 సర్కిల్, షా అకాడమీకి యాక్సెస్, ఫాస్ట్‌ట్యాగ్ లావాదేవీలపై క్యాష్‌బ్యాక్, వింక్ మ్యూజిక్, ఉచిత హలోతో పాటుగా ఎయిర్‌టెల్ థాంక్స్ ప్రయోజనాలను కూడా సబ్‌స్క్రైబర్‌లు పొందుతారు.

దీనితో పాటు ఎయిర్‌టెల్ రూ.549 ప్లాన్‌ను తెచ్చింది. ఇది 2GB రోజువారీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్‌ను అందిస్తోంది. ఈ ప్లాన్ వాలిడిటీ 56 రోజులు. ఈ ప్లాన్ ద్వారా అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ వెర్షన్‌కి ఒక నెల పాటు ఉచితంగా యాక్సెస్‌ పొందవచ్చు. ఇది కాకుండా, అపోలో 24/7 సర్కిల్‌కు యాక్సెస్ మూడు నెలల పాటు అందుబాటులో ఉంటుంది.

ఇతర నెట్‌వర్క్‌లు కూడా Airtelతో పోటీపడుతూ మంచి ప్లాన్‌లను తీసుకోచ్చాయి.

Vodafone Idea (Vi)– రూ.666 ప్రీ-పెయిడ్ ప్లాన్‌. ఈ ప్లాన్ ద్వారా సబ్‌స్క్రైబర్‌లు బింగే ఆల్ నైట్ (12 PM నుంచి 6 AM వరకు అపరిమిత ఇంటర్నెట్), వీకెండ్ డేటా రోల్‌ఓవర్, డేటా డిలైట్ వంటి ప్రయోజనాలను పొందవచ్చు. ప్లాన్ వాలిడిటీ 77 రోజులు.

Jio- రూ.666 ప్లాన్. ఈ ప్లాన్ Airtel, Vodafone Idea కంటే ఎక్కువ కాలం పాటు వాలిడిటీ ని అందిస్తోంది. ఈ ప్లాన్ 84 రోజులు చెల్లుబాటు అవుతుంది. అన్‌లిమిటెడ్ కాలింగ్. రోజు 1.5 GB డేటాను అందిస్తోంది.


Next Story

Most Viewed