స్పెషల్ వన్‌తో ముంబైకి తిరిగొచ్చిన రష్మిక

120

దిశ, సినిమా : కొవిడ్-19 సెకండ్ వేవ్ వల్ల షూటింగ్ క్యాన్సిల్ కావడంతో ఏప్రిల్‌లో హైదరాబాద్‌కు తిరిగొచ్చిన రష్మిక.. తాజాగా తన అప్‌కమింగ్ హిందీ ప్రాజెక్ట్స్ కోసం ముంబైకి చేరుకుంది. తాజాగా ముంబై ఎయిర్‌పోర్టులో ప్రెట్టీ లుక్‌తో దర్శనమిచ్చిన ఈ సౌత్ బ్యూటీ.. తన చేతుల్లోని స్పెషల్ వన్‌తో అందరి అటెన్షన్‌ దోచేసింది. తన న్యూ పెట్ డాగ్ ‘ఓరా’తో కలిసి క్యూట్‌నెస్‌కు కేరాఫ్‌లా కనిపించింది. ఇదిలా ఉంటే.. ఇన్‌స్టా్గ్రామ్‌లో ఓరాను ఫ్యాన్స్‌కు పరిచయం చేసిన డియర్ లిల్లీ.. ‘హే గైస్.. బయట అనుభవించే అన్ని గందరగోళాలను మరిపించే మెడిసిన్ దొరికింది. నాకెప్పుడూ సంతోషాన్నిచ్చే లిటిల్ వన్ – ఓరాను మీకు పరిచయం చేస్తున్నా! దీంతో ఎవరైనా సరే 3 సెకన్లలో లవ్‌లో పడతారని చెప్పారు కానీ.. 0.3 మిల్లీ సెకన్లలోనే నా హృదయాన్ని కరిగించింది!’ అంటూ పోస్ట్ చేసింది.

ఇక సినిమాల విషయానికొస్తే, సిద్దార్థ్ మల్హోత్రా సరసన ‘మిషన్ మజ్ను’లో నటిస్తుండగా.. హిందీలో రష్మికకు ఇదే మొదటి సినిమా. దీంతో పాటు అమితాబ్ బచ్చన్ స్టారింగ్ ‘గుడ్‌బై’ సినిమాలో ఆయన డాటర్ రోల్‌లో కనిపించనుంది. ఇక పాన్ ఇండియా స్టార్‌గా మారిన రష్మిక.. తెలుగులో సుకుమార్-అల్లు అర్జున్ ‘పుష్ప’ చిత్రంలోనూ లీడ్ రోల్ పోషిస్తోంది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..