- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్ టు లండన్‌కు ఎయిరిండియా విమాన సర్వీసులు ప్రారంభం
<p>దిశ, తెలంగాణ బ్యూరో: లండన్ ఇప్పుడు హైదరాబాద్ నుంచి కేవలం తొమ్మిది గంటల దూరంలోనే ఉంది. హైదరాబాద్ నుంచి లండన్‌కు ఎయిరిండియా తొలి డైరెక్ట్ విమాన సర్వీసును శుక్రవారం నుంచి మొదలైంది. ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI 147 హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరింది. ఈ సందర్భంగా విమానాశ్రయానికి చెందిన సీనియర్ అధికారులు, ఎయిర్ ఇండియా అధికారులు ప్రయాణీకులు, సిబ్బందికి ఘనంగా వీడ్కోలు పలికారు. ఎయిర్ ఇండియా నాన్‌స్టాఫ్ విమానాలు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి […]</p>

దిశ, తెలంగాణ బ్యూరో: లండన్ ఇప్పుడు హైదరాబాద్ నుంచి కేవలం తొమ్మిది గంటల దూరంలోనే ఉంది. హైదరాబాద్ నుంచి లండన్‌కు ఎయిరిండియా తొలి డైరెక్ట్ విమాన సర్వీసును శుక్రవారం నుంచి మొదలైంది. ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI 147 హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరింది. ఈ సందర్భంగా విమానాశ్రయానికి చెందిన సీనియర్ అధికారులు, ఎయిర్ ఇండియా అధికారులు ప్రయాణీకులు, సిబ్బందికి ఘనంగా వీడ్కోలు పలికారు.
ఎయిర్ ఇండియా నాన్‌స్టాఫ్ విమానాలు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హీత్రో విమానాశ్రయం మధ్య వారానికి రెండు సార్లు సోమవారం, శుక్రవారం నడుస్తాయి. ఎయిర్ ఇండియా విమానం A 147 సోమవారం ఉదయం 1.30 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి హీత్రో విమానాశ్రయానికి 7.30 AM (స్థానిక సమయం) చేరుకుంటుంది. అదే విమానం శుక్రవారం ఉదయం 5.30 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి లండన్‌కు 11.25 గంటలకు (స్థానిక సమయం) చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో AI 148 విమానం లండన్ నుంచి ఉదయం 9.45 (స్థానిక సమయం) కు బయలుదేరి, 23.35 PM కు హైదరాబాద్ చేరుకుంటుంది.

ఈ సందర్భంగా జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ సీఈఓ ప్రదీప్ ఫణికర్ మాట్లాడుతూ.. యూరప్‌లో భారతీయులకు అత్యంత ఇష్టమైన గమ్యస్థానం లండన్ అన్నారు. లండన్‌కు వెళ్లే ఈ నాన్-స్టాప్ ఎయిర్ ఇండియా విమానం యూరప్‌కు ఎలాంటి ఆటంకాలు లేని ఎయిర్ కనెక్టివిటీని అందిస్తుందన్నారు. ఈ సర్వీసు లీజర్ ప్రయాణీకులకు, లండన్‌లోని విద్యాసంస్థల్లో అడ్మిషన్లు కోరుకునే విద్యార్థులకు, రాబోయే సంవత్సరాల్లో వ్యాపారాలు విస్తరించుకోవడానికి సహాయపడుతుందన్నారు. ఎయిరిండియా విమానానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇతర సమీప రాష్ట్రాల నుంచి మంచి ఆదరణ లభిస్తుందన్నారు.

థేమ్స్ నది ఒడ్డున ఉన్న లండన్ యాత్రికుల స్వర్గధామం. నగరం దాని సంపద, సంస్కృతి మరియు చరిత్ర ఉంది. పార్లమెంటు హౌజ్ నుంచి లండన్ అండర్ గ్రౌండ్ వరకు, నగరంలో అనేక విహార ప్రదేశాలున్నాయి. న్యూఢిల్లీ విమానాశ్రయం ప్రధాన కేంద్రంగా ఉన్న ఎయిర్ ఇండియా ప్రభుత్వ యాజమాన్యంలోని జాతీయ క్యారియర్. ఎయిర్ ఇండియా నెట్‌వర్క్ దేశీయ, ప్రాంతీయ గమ్యస్థానాలతో పాటు ఆసియా, మధ్యప్రాచ్యం, యూరప్, ఉత్తర అమెరికాకు అంతర్జాతీయ సేవలను అందిస్తోంది.






