2026 నాటికి రూ. 15 లక్షల కోట్లకు ఆటోమొబైల్ వార్షిక టర్నోవర్!

by  |
2026 నాటికి రూ. 15 లక్షల కోట్లకు ఆటోమొబైల్ వార్షిక టర్నోవర్!
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌ను గ్లోబల్ తయారీ హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర రోడ్డు, రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఇందుకోసం 2026 నాటికి ఆటోమొబైల్ రంగ వార్షిక టర్నోవర్‌ను రూ. 15 లక్షల కోట్లకు రెట్టింపు అవుతుందని నితిన్ గడ్కరీ తెలిపారు. వాహన స్క్రాపింగ్, రీసైక్లింగ్ యూనిట్ ప్రారంభ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. వాహన వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడం వల్ల ఈ రంగానికి మాత్రమే కాకుండా ఆర్థికవ్యవస్థకు విస్తృతమైన ప్రయోజనాలు ఉంటాయని గడ్కరీ పేర్కొన్నారు. ప్రస్తుత దేశంలో ఆటోమొబైల్ రంగ వార్షిక టర్నోవర్ రూ. 7.5 లక్షల కోట్లుగా ఉండగా, ఇందులో రూ. 3 లక్షల కోట్ల విలువైన ఎగుమతులు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో వాహన స్క్రాపేజ్, రీసైక్లింగ్ విస్తరణ వల్ల దీర్ఘకాలంలో ఇన్‌పుట్ ఖర్చులను తగ్గించేందుకు స్థానిక పరిశ్రమలకు ప్రపంచ మార్కెట్లో మరింత పోటీ పడే సామర్థ్యాన్ని ఇస్తుందని గడ్కరీ చెప్పారు. ‘ప్రభుత్వం ప్రారంభించిన స్క్రాపేజ్ విధానం ద్వారా అంతర్జాతీయ మార్కెట్లో పోటీ పడేందుకు వీలవుతుంది. ఎందుకంటే కీలక ముడి లోహాలు రీసైక్లింగ్ చేయబడతాయి. దీనివల్ల మెటీరియల్ ఖర్చులను తగ్గిస్తుంది. ఉక్కు, రాగి, అల్యూమినియం, ప్లాస్టిక్, రబ్బరు లాంటి ముడి పదార్థాల ధరలను తగ్గిస్తుంది. అంతేకాకుండా రీసైక్లింగ్ వల్ల దిగుమతులను తగ్గించుకోవచ్చు. ఇది ప్రభుత్వం ఆత్మ నిర్భర్ భారత్‌ను సాధించేందుకు సహాపడుతుందని’ వెల్లడించారు.

వాహన స్క్రాపేజ్ విధానం ద్వారా తయారీ వ్యయాన్ని 33 శాతం తగ్గించి అమ్మకాలను 12 శాతం పెంచేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి ప్రభుత్వం స్క్రాపింగ్, రీసైక్లింగ్ రంగంలో రూ. 10 వేల కోట్ల అదనపు పెట్టుబడులను సాధించాలని భావిస్తోందన్నారు.


Next Story

Most Viewed