‘డెల్టా ప్లస్ వేరియంట్ పేషెంట్ పక్కన నడిచినా సోకుతుంది’

by  |
AIIMS Chief Dr. Randeep Guleria
X

న్యూఢిల్లీ: కరోనా వైరస్ డెల్టా ప్లస్ వేరియంట్ అత్యధిక వేగంతో క్షణాల్లో వ్యాప్తి చెందుతుందని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. డెల్టా ప్లస్ వేరియంట్ పేషెంట్ నుంచి పక్కన నడుచుకుంటూ వెళ్లినా ఇన్ఫెక్ట్ అవుతుందని, వ్యాప్తి చెందే సామర్థ్యం ఈ వేరియంట్ అధికంగా ఉంటుందని ఆయన వివరించారు. క్షణకాలం సదరు పేషెంట్‌తో ఎదురుపడినా ఇన్ఫెక్ట్ అయ్యే ముప్పు ఉంటుందని చెప్పారు. ఎలాంటి వేరియంట్‌లనైనా ఎదుర్కోవడానికి కీలకాస్త్రాలుగా భౌతిక దూరం, లాక్‌డౌన్, వ్యాక్సినేషన్‌ను పేర్కొన్నారు. థర్డ్ వేవ్ తీవ్రతను తగ్గించడానికి ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.


Next Story

Most Viewed