- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రధాని ముందు మోకరిల్లడానికే : మధుయాష్కి
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీపైన విమర్శలు చేసిన సీఎం కేసీఆర్ ఇప్పుడు ఢిల్లీ వెళ్లి ప్రధాని ముందు మోకరిల్లుతున్నాడని ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కి విమర్శించారు. సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన వెనుక రహస్యమేమిటంటూ ప్రశ్నించారు. గాంధీభవన్లో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. సీబీఐ, ఈడీ కేసులకు భయపడి సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్తున్నారా అని అనుమానం వ్యక్తం చేశారు. బీజేపీ, టీఆర్‌ఎస్, ఎంఐఎం కలిసి ప్రజలను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదనడం […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీపైన విమర్శలు చేసిన సీఎం కేసీఆర్ ఇప్పుడు ఢిల్లీ వెళ్లి ప్రధాని ముందు మోకరిల్లుతున్నాడని ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కి విమర్శించారు. సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన వెనుక రహస్యమేమిటంటూ ప్రశ్నించారు. గాంధీభవన్లో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. సీబీఐ, ఈడీ కేసులకు భయపడి సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్తున్నారా అని అనుమానం వ్యక్తం చేశారు. బీజేపీ, టీఆర్‌ఎస్, ఎంఐఎం కలిసి ప్రజలను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదనడం స్వార్థరాజకీయాలకు నిదర్శనమని, కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు టీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం కుట్రలు చేస్తోందని, మతం పేరుతో రెచ్చగొట్టేవారికి యువత దూరంగా ఉండాలని మధుయాష్కి సూచించారు.
Next Story






