- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అహ్మదాబాద్‌లో వారాంతంలో కర్ఫ్యూ
by Shamantha N |
<p>అహ్మదాబాద్: కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తున్న తరుణంలో కట్టడి చర్యలు ఊపందుకుంటున్నాయి. అహ్మదాబాద్‌లో ఈ వారాంతంలో కర్ఫ్యూ విధించడానికి నగర మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ పాటించాలని ఆదేశించింది. ఈ రెండురోజుల కర్ఫ్యూ కాలంలో ఔషధాలు, పాలు అమ్మకానికి మాత్రమే అనుమతి ఇచ్చింది. దీంతో స్థానికులు భయంతో సమీప మార్కెట్‌లలో సరుకులు, కూరగాయల కొనుగోలుకు పెద్దపెట్టున తరలివెళ్లారు. ఈ ఆందోళనల నేపథ్యంలో […]</p>

X
అహ్మదాబాద్: కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తున్న తరుణంలో కట్టడి చర్యలు ఊపందుకుంటున్నాయి. అహ్మదాబాద్‌లో ఈ వారాంతంలో కర్ఫ్యూ విధించడానికి నగర మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ పాటించాలని ఆదేశించింది. ఈ రెండురోజుల కర్ఫ్యూ కాలంలో ఔషధాలు, పాలు అమ్మకానికి మాత్రమే అనుమతి ఇచ్చింది. దీంతో స్థానికులు భయంతో సమీప మార్కెట్‌లలో సరుకులు, కూరగాయల కొనుగోలుకు పెద్దపెట్టున తరలివెళ్లారు. ఈ ఆందోళనల నేపథ్యంలో రాష్ట్ర సీఎం విజయ్ రూపానీ స్పందించారు. వీకెండ్ కర్ఫ్యూ కేవలం అహ్మదాబాద్‌కే పరిమితమని, కరోనా కట్టడికి ముందస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నారని వివరించారు. రాష్ట్రంలో మళ్లీ లాక్‌డౌన్ విధించాలని భావించడం లేదని, దానిపై చర్చలూ లేవని స్పష్టం చేశారు.
Next Story






