రైతులకు అలర్ట్..భారీగా పెరుగుతున్న ఎండుమిర్చి ధర.. క్వింటాల్ కు ఎంతంటే

by velandi.Saikiran |

రెండు తెలుగు రాష్ట్రాల రైతులకు బిగ్ అలర్ట్. తెలంగాణ అలాగే ఏపీలో ఎండుమిర్చి ధర క్రమక్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా

రైతులకు అలర్ట్..భారీగా పెరుగుతున్న ఎండుమిర్చి ధర.. క్వింటాల్ కు ఎంతంటే
X

దిశ, వెబ్ డెస్క్ : రెండు తెలుగు రాష్ట్రాల రైతులకు బిగ్ అలర్ట్. తెలంగాణ అలాగే ఏపీలో ఎండుమిర్చి ధర క్రమక్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఖమ్మం, వరంగల్ మార్కెట్ యార్డులలో ఎండుమిర్చి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. గత నెలతో పోలిస్తే... ఇప్పుడు మిర్చి క్వింటాలకు ఏకంగా 500 రూపాయలు పెరిగింది. గతంలో ఎన్నడు లేని విధంగా ఈ ఏడాది మిర్చి ( MIRCHI ) ధర క్రమక్రమంగా పెరుగుతోంది.

ఖమ్మం ( KHAMMAM) మార్కెట్ యార్డులో నాణ్యమైన తేజా రకం క్వింటాల్ కు ఏకంగా 14,500 వరకు పలుకుతోందని అధికారులు వెల్లడించారు. ఇక సగటు ధరలు 13500 నుంచి 14 వేల రూపాయల వరకు పలుకుతుందని మిర్చి యార్డ్ అధికారులు చెబుతున్నారు. విదేశాలకు ఎగుమతులు విపరీతంగా పెరిగాయని... అందుకే ధరలు క్రమక్రమంగా పెరుగుతున్నట్లు వివరించారు.

అలాగే మిర్చి దిగుబడి కూడా కాస్త తగ్గినట్లు చెబుతున్నారు. ఈసారి మిర్చి పంట పండించిన రైతుకు.. నిజంగా పండగ వాతావరణం అని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులు ఇప్పుడే మిర్చి పంటను.. మార్కెట్ కు తీసుకువెళ్లి విక్రయించుకుంటే లాభపడతారని కూడా సూచనలు చేస్తున్నారు వ్యవసాయ అధికారులు. వచ్చే నెల రోజులపాటు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ ఇవే ధరలు కొనసాగితే సామాన్య జనాలు.. మిర్చి కొనుగోలు చేయడం కష్టమే అవుతుంది. కిలో 200 కు పైగా పెట్టి మరి కొనుగోలు చేయాల్సి వస్తుంది.

Next Story