- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rice Water : బియ్యం నీళ్లతో మొక్కలు క్షేమం!
ఇంట్లో...ఫామ్ హౌస్ లలో మొక్కలు పెంచడం(Growing plants) చాలమందికి హాబీ గా ఉంటుంది. అయితే మొక్కల పెంపకంలో అవగాహాన లేక వందలు..వేలు పెట్టి కొనుగోలు చేసుకొచ్చి పెంచుకుంటున్న మొక్కల్లో కొన్ని ఆకస్మాత్తుగా చనిపోతే పెంపకందారుల బాధ అంతా ఇంత కాదు. మనం మొక్కను ఎంత జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రయత్నించినా, కొన్నిసార్లు అది వాడిపోతుంది.

దిశ, వెబ్ డెస్క్ : ఇంట్లో...ఫామ్ హౌస్ లలో మొక్కలు పెంచడం(Growing plants) చాలమందికి హాబీ గా ఉంటుంది. అయితే మొక్కల పెంపకంలో అవగాహాన లేక వందలు..వేలు పెట్టి కొనుగోలు చేసుకొచ్చి పెంచుకుంటున్న మొక్కల్లో కొన్ని ఆకస్మాత్తుగా చనిపోతే పెంపకందారుల బాధ అంతా ఇంత కాదు. మనం మొక్కను ఎంత జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రయత్నించినా, కొన్నిసార్లు అది వాడిపోతుంది. మరికొన్ని నిర్వహణ పద్ధతులను సరిగ్గా పాటించకపోవడంతో..ఇంకొన్ని తెగుళ్లతో చనిపోతుంటాయి. ఈ సమస్యల నుంచి మొక్కలను కాపాడుకునేందుకు(Plants are healthy)..మొక్కలు బాగా పెరగడానికి నిపుణులు పలు చిట్కాల(Tips)ను వెల్లడించారు.
వాటిలో కొన్ని సాంప్రదాయ సస్యరక్షణ..మరికొన్ని రసాయన మందుల వినియోగం ద్వారా పాటించే చిట్కాలున్నాయి. అయితో మనం ఇంట్లో అన్నం వండుకునే క్రమంలో బియ్యం కడిగేశాక ఉండే నీరు(Rice Water) కూడా మొక్కల సంరక్షణకు బాగా పనికి వస్తుందంటున్నారు నిపుణలు. ఇంట్లో గులాబీ మొక్కలు, పూల మొక్కలకు బియ్యం కడగడానికి ఉపయోగించే నీటిని ఎరువుగా మొక్కలకు పోయవచ్చట.
కానీ మీరు ఈ బియ్యం నీటిని మొక్కలపై ఉపయోగించే ముందు రెండు రోజులు పులియబెట్టాలి. ఈ నీటిని నానబెట్టేటప్పుడు, మనం ప్రతిరోజూ ఉపయోగించే కూరగాయలను అందులో వేసి నానబెట్టవచ్చు. ఇలా చేసినప్పుడు, కూరగాయలలోని పోషకాలు కూడా నీటిలో కలిసిపోతాయి. ఇది మొక్కలు అవసరమైన శక్తిని పొందడానికి సహాయపడుతుంది. ఒక కప్పు బియ్యం నీటిని ఐదు కప్పుల సాధారణ నీటితో కలిపి మొక్కలపై పోయాలి. మీరు ఇలాగే చేస్తూ ఉంటే, మొక్కలు వికసించి వృద్ధి చెందుతాయంటున్నారు నిపుణులు.
బియ్యం నీటితో పాటు అరటి తొక్క, నిమ్మకాయ నీరు, నారింజ నీరు వంటి వాటి వినియోగంతో మొక్కలను మంచిగా ఎదగడానికి ఉపయోగపడుతాయంటున్నారు.






